కిసాన్ పరేడ్ ఎఫెక్ట్ : ఫిబ్రవరి 1న నిర్వహించే పార్లమెంట్ మార్చ్ రద్దు!.. ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపణలు..

|

Jan 28, 2021 | 12:17 AM

FARMERS PROTEST: గత కొద్ది రోజులుగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

కిసాన్ పరేడ్ ఎఫెక్ట్ : ఫిబ్రవరి 1న నిర్వహించే పార్లమెంట్ మార్చ్ రద్దు!.. ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపణలు..
Follow us on

FARMERS PROTEST: గత కొద్ది రోజులుగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజున రైతు సంఘాల నేతలు కిసాన్ పరేడ్‌కు పిలుపునివ్వగా ఆ కార్యక్రమం కాస్తా హింసకు దారితీసింది. దీంతో ఫిబ్రవరి 1న తలపెట్టే పార్లమెంట్‌ మార్చ్‌ను రద్దు చేసుకుంటున్నట్లు కొన్ని సంఘాల రైతు నేతలు ప్రకటించారు.

ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్లకు కిసాన్ పరేడ్ బలైందని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. తమ ట్రాక్టర్‌ పరేడ్‌ను ప్రభుత్వం విచ్ఛిన్నం చేయాలని చూసినా 99.9 శాతం మంది రైతులు శాంతియుతంగానే ర్యాలీలో పాల్గొన్నారని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. తమతో సంబంధం లేని పంజాబ్‌ కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీని ముందు పెట్టి ఉద్రిక్తతలు జరిగేలా చూశారని ఆరోపించారు. అయినా శాంతియుతంగా రైతుల ఆందోళన కొనసాగుతుందని రైతు నేతలు స్పష్టంచేశారు. ఇక కిసాన్ పరేడ్‌ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పలువురు రైతు నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాకేశ్‌ తికాయత్‌, దర్శన్‌పాల్‌, యేగేంద్ర యాదవ్‌ సహా మొత్తం 37 మంది నేతలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మొత్తం 22 ఎఫ్‌ఐఆర్‌ల్లో వీరి పేర్లు చేర్చారు. మంగళవారం జరిగిన ఘటనల్లో 300 మంది పోలీసులు గాయపడ్డారు. హింసకు పాల్పడిన 200 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వివరించారు.

Navreet Singh: బంధువులకు విందివ్వడానికి వచ్చి విగతజీవిగా మారిపోయాడు.. ఉద్యమ రూపంలో యువకుడి బలి..