Indian Army: దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడం ఒక వరంగా భావించే భారత ఆర్మీ.. బెస్ట్ కొటేషన్స్ మీ కోసం

|

Aug 12, 2022 | 9:32 AM

భారత స్వాతంత్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో.. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యజించడం ఒక వరంగా భావించే భారత సైన్య అధికారులు, జవాన్లు చెప్పిన కొన్ని కొటేషన్స్ గురించి తెలుసుకుందాం.. 

Indian Army: దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడం ఒక వరంగా భావించే భారత ఆర్మీ.. బెస్ట్ కొటేషన్స్ మీ కోసం
Indian Army Independence Da
Follow us on

Indian Army: మేము ఇక్కడ సురక్షితంగా ఉన్నాం.. మేము ఇక్కడ ఎటువంటి కలతలు లేకుండా సుఖంగా నిద్రపోతున్నాం.. ఒకరిపై ఒకరు ద్వేషంతో ఉక్రోషంతో కొట్టుకుంటున్నాం.. స్వేచ్చావిహంగంలా విహరిస్తున్నాం.. అంటే దీనికి కారణం మీరు దేశ సరిహద్దు ప్రాంతంలో ఎండకు ఎండి, వర్షానికి తడిచి.. చలికి వణుకుతూ కావాలా ఉండడమే.. భారత ఆర్మీ జవాన్లు మనదేశ భూ భాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతున్నారు. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం.. భారత స్వాతంత్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో.. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యజించడం ఒక వరంగా భావించే భారత సైన్య అధికారులు, జవాన్లు చెప్పిన కొన్ని కొటేషన్స్ గురించి తెలుసుకుందాం..

  1. * నేను తప్పకుండా వస్తాను.. అయితే జాతీయ జెండా ఎగరవేసి అయినా వస్తాను లేదా జెండా చుట్టబడి అయినా వస్తానని పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా చెప్పారు.
  2. *మీ జీవితంలో ఒక సాహసకృత్యం మాకు నిత్యకృత్యమని లఢక్ వద్ద కావాలా ఉండే.. లేహ్ హైవేపై సైనిక బోర్డు వెల్లడించింది.
  3. *చావు నా ముందుకు వస్తే.. దాని చావు అది కోరి తెచ్చుకున్నట్లే నని .. 1/11 గూర్ఖా రైఫిల్స్ కెప్టెన్ పరమ్ వీర్ చక్ర మనోజ్ కుమార్ పాండే చెప్పారు,
  4. *మన జెండా గాలికి ఎగరదు.. దానిని కాపాడే ‘సైనికుల’ ఊపిరికి ఎగురుతుందన్నారు భారత ఆర్మీ
  5. *మమ్మల్ని చూడాలనుకో, మంచిదే. పట్టుకోవాలనుకో, చాలా వేగం ఉండాలి. కానీ మమ్మల్ని ఓడించాలనుకుంటే ‘అంతకంటే జోక్ మరొకటి ఉండదని సినీ తరహా డైలాగ్ చెప్పారు భారత జవాన్లు.
  6. *మా శత్రువుల మీద భగవంతుడి దయ ఉండాలని కోరుకుంటాం.. మా శత్రువు మా కంట పడకుండా ఉండాలి.. ఎందుకంటే మా ఎదుట పడితే మాకు దయాదాక్షిణ్యాలు ఉండవని శత్రువు పట్ల తమ దృక్పధాన్ని చెప్పారు
  7. *మేము బ్రతికి ఉండటం అనేది ఒక ఛాన్స్. మమ్మల్ని అభిమానించడం అనేది మీ ఛాయిస్. కానీ శత్రువుని చంపడం మా ప్రొఫెషన్ అని చెన్నైలోని భారత ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెప్పారు.
  8. *టెర్రరిస్టులపై దయ చూపడం దేవుడి డ్యూటీ. మా డ్యూటీ మాత్రం వారిద్దరి మధ్య మీటింగ్ ఏర్పాటు చెయ్యడమే అన్నారు ఇండియన్ ఆర్మీ అధికారులు
  9. *దేశం కోసం నాకు ఒకటే జీవితం ఇచ్చినందుకు బాధగా ఉందని ఆర్మీ ఆఫీసర్ ప్రేమ్ రాంచందాని చెప్పి.. దేశం అంటే తనకు ఉన్న ప్రేమ గురించి వెల్లడించారు.
  10. *యుద్ధభూమిలో యోధుడు మరణించినందుకు విలపించవద్దు. యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వారిని స్వర్గంలో సత్కరించినట్లే-కేఎం కరియప్ప

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..