Gold Rate : బంగారం ధరకు మరో సారి రెక్కలు వచ్చాయి. పసిడి ధర ఏమాత్రం తగ్గిన భారీగా కొనుగోలు జరుగుతాయి. అయితే కరోనా సమయంలో బంగారం ధరలు ఆకాశానంటాయి. భారీగా పెరుగుతూ పసిడి రికార్డ్ స్థాయికి చేరింది. తాజాగా.. మరోసారి బంగారం ధరలు పెరిగిపోయాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరిగి రూ. 48,000 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెరిగి రూ. 52,360 కి చేరింది.
ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా….
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,560 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 52,950 గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.48,000 ఉండగా… 24 క్యారెట్ల ధర 52,360గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 50,320, కాగా 24 క్యారెట్ల ధర 51,320. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 50,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 54,700గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర 52,360గా నమోదైంది.
మరిన్ని ఇక్కడ చదవండి :