
గత రెండు మూడు రోజులు యావత్ దేశం దృష్టిమొత్తం తమిళనాడు రాజకీయాలపైనే ఉంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో ఎవరూ ఊహించని విధంగా భారీ మెజార్టీ సీట్లు గెలుచుకొని సీఎం అయ్యేందుకు ఎదురు చూస్తున్న టీవీకే అధినేత విజయ్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగిలాయి. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యేల సంఖ్య సరిపోకపోవడంతో ఆయన ఇతర పార్టీ మద్దతు కోరాల్సి వచ్చింది. అయితే వీసేకే పార్టీ తొలుత మద్దతు ఇచ్చినట్టుగానే ఇచ్చి తర్వాత మళ్లీ హ్యాండ్ ఇవ్వడంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు ఆగిపోయింది. ఇక ఇవాళ ఎట్టకేలకు టీవీకే మద్దతు ఇస్తున్నట్టు వీసీకే పార్టీ లేక ఇవ్వడంతో సమస్య సాల్వ్ అయ్యింది.
వీసీకే ఇచ్చిన మద్దతు లెటర్‌తో విజయ్ స్వయంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలాన్ని వివరించారు. కూటమిలోని కీలక పార్టీల మద్దతుతో ఆయనకు స్పష్టమైన మెజారిటీ ఉందని గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. ప్రస్తుతం ఆయనకు కాంగ్రెస్, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళనాడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ పార్టీ, ఇండియన్ ముస్లిం లీగ్‌తో సహా 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్నారు. దీంతో ఆదివారం సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు విజయ్ సిద్ధమయ్యారు.
చెన్నైలోని ప్రఖ్యాత నెహ్రూ ఇండోర్ స్టేడియం ఈ చారిత్రాత్మక ఘట్టం జరగనుంది. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 3:15 గంటలకు విజయ్‌తో పాటు మరో 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం అధికారులు ఇప్పటికే స్టేడియంలో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.