ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఇంటిబయట ఆడుకుంటున్న ఓ చిన్నారి బాలుడు ఏకంగా ఓ పామును కొరికి చంపేశాడు. ఈ ఘటన స్ధానికంగా సంచలనం రేపింది. ఈ విచిత్ర ఘటన ఫరూఖాబాద్ జిల్లా కొత్వాలి మహ్మదాబాద్ లోని మద్నాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దినేష్ సింగ్ అనే వ్యక్తి తన తల్లి, మూడేళ్ల కుమారుడుతో కలిసి ఉంటున్నాడు. శనివారం బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఇంతలో బాలుడివైపు ఓ పాము పిల్ల వచ్చింది. అదేంటో తెలియని ఆ చిన్నారి బాలుడు దాన్ని పట్టుకొని నోటిలో పెట్టుకొని కొరికాడు. అది చనిపోయింది.
ఆ తర్వాత కాసేపటికి బాలుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే బాలుడ్ని కుటుంబ సభ్యులు చనిపోయిన పాముపిల్లను పాలీబ్యాగ్‌లో ఉంచి చిన్నారితో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆస్పత్రికి వైద్యులు తక్షణం స్పందించి సకాలంలో మంచి వైద్యం అందించారు. 24 గంటల పాటు బాలుడిని అబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యులు అతడికి ప్రాణాపాయం లేదని ప్రకటించారు. బాలుడు ప్రాణాపాయం తప్పి సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంతకు ముందెన్నడూ తన మనవడు ఇలా ప్రవర్తించలేదని నాయనమ్మ సునీతాదేవి చెప్పింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..