భారత్‌కు తిరిగి రానున్న 9వ శతాబ్ధానికి చెందిన 3 పురాతన శిల్పాలు.. వీటి ప్రత్యేక ఏంటో తెలుసా?

వాషింగ్టన్ లోని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ నుండి మూడు పురాతన శిల్పాలు తిరిగి భారతదేశానికి చేరుకోనున్నాయి. తమిళనాడులోని దేవాలయాల నుండి ఇవి చోరీకి గురైనట్లు పరిశోధనలో తేలడంతో, వీటిని భారత్‌కు తిరిగి అప్పగించేందుకు స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియంతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో త్వరలోనే ఈ విగ్రహాలు మళ్లీ మన దేశానికి చేరుకోనున్నాయి.

భారత్‌కు తిరిగి రానున్న 9వ శతాబ్ధానికి చెందిన 3 పురాతన శిల్పాలు.. వీటి ప్రత్యేక ఏంటో తెలుసా?
Antiquities Repatriation

Updated on: Mar 27, 2026 | 11:48 AM

తమిళనాడులోని దేవాలయాల నుండి దొంగిలించబడినట్లు పరిశోధనలో తేలిన మూడు పురాతన శిల్పాలను స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ త్వరలోనే ఇండియాకు తిరిగి పంపనుంది. తొమ్మిదవ శతాబ్దానికి చెందిన శివ నటరాజ కాంస్య విగ్రహం, 12వ శతాబ్దానికి చెందిన శివ-ఉమల శిల్పం, 16వ శతాబ్దానికి చెందిన సెయింట్ సుందరర్ దంపతుల శిల్పాలను తిరిగి అప్పగించేందుకు, అమెరికాలోని భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నమగ్యా ఖంపా ఇక్కడ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ (NMAA) డైరెక్టర్ చేజ్ రాబిన్సన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు వీటిని త్వరలోనే ఇండియాకు పంపనున్నట్టు వార్ ఎక్స్ వేదికగా పోస్ట్‌లో పేర్కొన్నారు.

పుదుచ్చేరిలోని ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఫోటో ఆర్కైవ్స్ సహాయంతో జరిపిన పరిశోధనలో, ఈ విగ్రహాలు తమిళనాడులోని వివిధ ఆలయాల్లో గతంలో ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. పరవితో ఉన్న సుందరార్ శిల్పాన్ని 1956లో తమిళనాడులోని కల్లకురుచ్చి తాలూకా, వీరసోలపురం గ్రామంలోని శివాలయంలో ఫోటో తీసినట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. ఇక సోమస్కంద అని పిలువబడే 12వ శతాబ్ధానికి చెందిన శివ, ఉమల కంచు విగ్రహాం మన్నార్గుడి తాలూకాలోని ఆలత్తూరు విశ్వనాథ ఆలయంలో 1959లో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.

అలాగే శివ నటరాజ విగ్రహం తంజావూరు జిల్లా తిరుత్తురైపూండిలోని శ్రీ భవ ఔషదీశ్వర ఆలయానికి చెందినదినదిగా గుర్తించబడింది. దీనిని 2002లో న్యూయార్క్‌లోని ఒక గ్యాలరీ నుండి మ్యూజియం కొనుగోలు చేసింది. ఈ పురాతన వస్తువుల మూలాలపై పరిశోధన జరిపిన అనంతరం, వాటిని భారతదేశం నుండి అక్రమంగా తరలించినట్లు మ్యూజియం గుర్తించిందని ఆ పోస్ట్‌లో పేర్కొంది. వీటిని త్వరలోనే మళ్లీ ఇండియా పంపనున్నట్టు తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us