Viral Video: దేవుళ్ల శక్తిని విశ్వసించేవారు.. సాధారణంగానే ఆ దేవతలకు భయపడుతారు. తప్పు చేయాలంటే జంకుతారు. కానీ, కొందరుంటారు.. భక్తి భక్తే, భుక్తి భుక్తే అని పక్కా కమిట్మెంట్‌తో ఉంటారు. అలాంటి వాడే ఈ దొంగ. దేవుడికి దణ్ణం పెట్టి మరీ దండుకున్నాడు. అవును, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఓ ఆలయంలో జరిగిన దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఓ దొంగ.. చోరీకి ముందు అమ్మవారికి నమస్కారం చేశాడు. అనంతరం హుండీలను కొల్లగొట్టాడు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జబల్‌పూర్‌లోని సుఖా గ్రామంలో అమ్మవారి ఆలయం ఉంది. అర్థరాత్రి వేళ ఆలయం లోపలికి ప్రవేశించిన ఓ ముసుగు దొంగ.. తొలుత భయపడుతూనే అమ్మవారికి నమస్కరించాడు. ఆపై తాను వచ్చిన పని పూర్తి చేశాడు. మెల్లగా ఆలయంలో ఉన్న హుండీలన్నీ ఎత్తుకెళ్లాడు. అయితే, చోరీ అంతా గుడిలో అమర్చిన సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ సంగతి ఇలా ఉంచితే.. చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగస్టు 5న ఈ చోరీ జరుగగా.. దొంగను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. చోరీకి పాల్పడిన దుండగుడు.. అమ్మవారి గుడిలో రెండు పెద్ద గంటలు, హుండీలను ఎత్తుకెళ్లాడు. కాగా, ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
This is another Video ??? pic.twitter.com/HSeLYz2ap9
— Naren Mukherjee ?? (@narendra52) August 10, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..