భారత్‌కి మరో గండం.. దూసుకొస్తున్న మిడతలు.. ఆందోళనలో అధికారులు..!

| Edited By:

May 26, 2020 | 2:06 PM

అసలే కరోనాతో దేశం అల్లకల్లమవుతోంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారుల్లో టెన్షన్ ఎక్కువవుతోంది.

భారత్‌కి మరో గండం.. దూసుకొస్తున్న మిడతలు.. ఆందోళనలో అధికారులు..!
Follow us on

అసలే కరోనాతో దేశం అల్లకల్లమవుతోంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారుల్లో టెన్షన్ ఎక్కువవుతోంది. కాగా ఇప్పుడు భారత్‌కు మరో గండం ముంచుకొస్తోంది. మిలియన్ల కొద్ది మిడతలు పంట పొలాలపై దండయాత్ర చేస్తున్నాయి. పాకిస్తాన్‌ మీదుగా భారత్‌లోకి వచ్చిన మిడతల దండు పంటలను నాశనం చేస్తూ ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. వీటి వలన ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. ఇక త్వరలోనే దక్షిణాది రాష్ట్రాలపైన ఈ మిడతల దాడి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

https://twitter.com/DrRakeshGoswami/status/1264770116941754375?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1264770116941754375&ref_url=https%3A%2F%2Fwww.gulte.com%2Fpolitical-news%2F8811%2Flocusts-the-next-big-threat-to-india-after-covid-19

మరోవైపు మిడతల నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు రైతులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కంచాలు, గరిటెలు, ఇతర వంట సామాగ్రితో పొలాల్లో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల భారీ శబ్దంతో మ్యూజిక్‌ను పెడుతున్నారు. మరికొన్ని చోట్ల మంటలు పెట్టడం, పొలాల్లో ట్రాక్టర్లు తిప్పుతూ మిడతలను బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అవేమీ పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. కాగా వ్యవసాయ భూముల్లోనే కాదు ఇళ్లపై కూడా ఈ మిడతల దాడి మొదలైంది. జైపూర్ నగరంలో మిడతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇళ్లు, గోడలు, చెట్లపై తిష్టేస్తున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అక్కడి అధికారులు క్రిమి సంహారక మందులను చల్లి వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత 27 ఏళ్లలో భారత్‌లో ఇదే అతిపెద్ద వినాశకర దాడి అని పరిశీలకులు చెబుతున్నారు. మొదట ఇరాన్‌ నుంచి పాకిస్తాన్‌కి వచ్చిన ఇవి, ఇప్పుడు భారత్‌లో బీభత్సం సృష్టిస్తున్నారు వివరిస్తున్నారు. కాగా ఆఫ్రికా ప్రాంతంలో అనుకోని తుఫాన్ల కారణంగానే మిడతల దాడులు ఎక్కువయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మిడతల దాడులకు కుదేలవుతున్న దేశాలకు ఐక్యరాజ్యసమితి సాయమందిస్తోంది. మిడతలపై పోరాడేందుకు కలిసికట్టుగా ముందుకు రావాలని భారత్, పాక్‌, ఇరాన్‌లకు పిలుపునిచ్చింది.

Read This Story Also: పీకేకు పోటీగా సునీల్‌.. రంగంలోకి దింపిన అధికార పార్టీ..!