పీకేకు పోటీగా సునీల్‌.. రంగంలోకి దింపిన అధికార పార్టీ..!

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అలియాస్‌ పీకే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ ఎవరి తరఫున పనిచేస్తే ఎన్నికల్లో వారి విజయం ఖాయమని అందరూ భావిస్తుంటారు. దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాగా ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం తమిళనాడులో డీఎంకేకు వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీకేకు పోటీగా అక్కడి అధికార అన్నాడీఎంకే సునీల్‌ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. కాగా 2016 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో […]

పీకేకు పోటీగా సునీల్‌.. రంగంలోకి దింపిన అధికార పార్టీ..!
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 10:58 AM

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అలియాస్‌ పీకే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ ఎవరి తరఫున పనిచేస్తే ఎన్నికల్లో వారి విజయం ఖాయమని అందరూ భావిస్తుంటారు. దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాగా ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం తమిళనాడులో డీఎంకేకు వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీకేకు పోటీగా అక్కడి అధికార అన్నాడీఎంకే సునీల్‌ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

కాగా 2016 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సునీల్, డీఎంకేకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. 2016 ఎన్నికల్లో డీఎంకే అధికారం చేజిక్కుంచుకోకపోయినా.. పెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలకు సంపాదించుకుంది. అయితే ఆ తరువాత 21 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సునీల్ వ్యూహం డీఎంకేకు దెబ్బేసింది. దీంతో డీఎంకేకు సునీల్ దూరం అయ్యారు. ఇక ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న డీఎంకే ప్రశాంత్ కిషోర్‌ను తమ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రశాంత్.. స్టాలిన్‌ను సీఎం చేయాలన్న లక్ష్యంతో పనిని మొదలెట్టినట్లు తెలుస్తోంది.

మరోవైపు అన్నాడీఎంకేలోకి వెళ్లిన సునీల్ అక్కడ తన పనిని ప్రారంభించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఐటీ విభాగాన్ని ప్రక్షాళ చేసినట్లు తెలుస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి బయటకు రాగానే అన్నాడీఎంకే, డీఎంకేలు ప్రచారాన్ని తమ వ్యూహాలతో ప్రజాక్షేత్రంలోకి వస్తాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.

Read This Story Also: కరోనాతో నర్సు మృతి.. పీపీఈ కిట్‌లే కారణమా..!