Biryani: బిర్యానీ తిని ప్రాణాలు కోల్పోయింది.. షాకింగ్ ఇన్సిడెంట్ పై పైర్ అయిన ప్రభుత్వం.. విచారణకు ఆదేశం..

|

Jan 07, 2023 | 3:41 PM

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టడం మనందరికీ తెలిసిందే. వండుకునే సమయం లేకపోవడం, బిజీ లైఫ్ కారణంగా.. ఒక్క క్లిక్ తో ఫుడ్ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చే్స్తోంది. అయితే.. కొన్ని సార్లు నాణ్యత లేని ఆహార..

Biryani: బిర్యానీ తిని ప్రాణాలు కోల్పోయింది.. షాకింగ్ ఇన్సిడెంట్ పై పైర్ అయిన ప్రభుత్వం.. విచారణకు ఆదేశం..
Biryani
Follow us on

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టడం మనందరికీ తెలిసిందే. వండుకునే సమయం లేకపోవడం, బిజీ లైఫ్ కారణంగా.. ఒక్క క్లిక్ తో ఫుడ్ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చే్స్తోంది. అయితే.. కొన్ని సార్లు నాణ్యత లేని ఆహార పదార్థాలు వస్తుంటాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆన్ లైన్ లో బిర్యానీ ఆర్డర్ చేసి.. ఆ వంటకాన్ని తిన్న తర్వాత ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన బిర్యానీ తిన్న మహిళ మహిళ మృతి చెందిన ఘటనపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. బిర్యానీలో ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. మృతురాలి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫొరెన్సిక్ నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. అంతే కాకుండా ఘటనపై నివేదిక ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు మంత్రి వీణా జార్జ్ వివరాలు వెల్లడించారు. కాగా..కేరళలోని కాసర్ గోడ్ సమీపంలోని పెరుంబాలకు చెదిన అంజూ శ్రీ పార్వతి.. ఆన్ లైన్ లో ‘కుజిమంతి’ అనే ఆహారాన్ని ఆర్డర్ చేసింది. ఈ వంటకాన్ని తిన్న తర్వాత.. ఫుడ్ పాయిజనింగ్ కు గురైంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక అక్కడి నుంచి కర్ణాటకలోని మంగళూరులోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

కొద్దిరోజుల క్రితం కొజికోడ్‌లో కూడా ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. కొట్టాయం మెడికల్ కాలేజ్‌కు చెందిన నర్స్‌ దగ్గర్లోని హోటల్‌లో ఆహారం తిన్న తర్వాత మృతి చెందింది. ఆమె మృతికి ఫుడ్‌ పాయిజనే కారణమని అనుమానాలున్నాయి. దీంతో ఈ వరుస ఘటనలను కేరళ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..