దేశంలో పలు ప్రాంతాల్లో ఉగ్ర మూకలు పాగా వేశాయి. అనేక ప్రాంతాల్లో దాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రచించినట్లు తేలింది. అయితే వీరి వ్యూహాలను, దాడి ప్రయత్నాలను భగ్నం చేసింది ఎన్ఐఏ. అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, బళ్లారి, కేరళలో భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ప్రధాన నిందితుడుగా మీనాజ్ ను గుర్తించారు. ఇతనితో పాటూ ఆరు మంది ఉగ్రమూకలను అరెస్ట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో విస్తృత స్థాయి సోదాలు నిర్వహిస్తున్నారు. ఖలీఫా ఐసిస్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..