అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానం, తెలంగాణ 6వ స్థానం.. వివరాలు విడుదల చేసిన ఆర్బీఐ

|

Mar 03, 2021 | 5:27 AM

బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పులు తీసుకోవడంలో ఏపీ 4వ స్థానంలో ఉంటే, తెలంగాణ 6వ స్థానంలో ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం విడుదల చేసిన దాని ప్రకారం.. 2020 ఏప్రిల్‌ ...

అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానం, తెలంగాణ 6వ స్థానం.. వివరాలు విడుదల చేసిన ఆర్బీఐ
Follow us on

బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పులు తీసుకోవడంలో ఏపీ 4వ స్థానంలో ఉంటే, తెలంగాణ 6వ స్థానంలో ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం విడుదల చేసిన దాని ప్రకారం.. 2020 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్ నెల వరకు ఏపీ రూ.44,250 కోట్లు, తెలంగాణ రూ.36,354 కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించాయి. ఈ అంశంలో ఏపీ కంటే మహారాష్ట్ర ముందంజలో ఉంది. ఆ రాష్ట్రానికి రూ.65,000 కోట్లు, తమిళనాడు రూ.63,000 కోట్లతో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ డిసెంబర్‌ 30 రోజుల పాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ సౌకర్యం, 26 రోజుల పాటు చేబదుళ్లు, మూడు రోజుల పాటు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకుంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా తక్కువేమి కాదు.

28 రోజుల పాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ సౌకర్యం, 20 రోజుల పాటు చేబదుళ్లు, 13 రోజుల పాటు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వాడుకుంది. నెలవారీగా బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకున్నాక కూడా రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీరకపోతే ప్రభుత్వాలు ఈ మూడింటిలో ఏదో ఒక సౌకర్యాన్ని వాడుకుని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుంటాయి. అలా కాకుండా మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక ఇబ్బందుల తీవ్రతకు అద్దం పడుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ వరకు 29 రాష్ట్రాలు కలిపి బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.5,55,852 కోట్ల అప్పు చేశాయి. డిసెంబర్‌ నాటికి ఏపీ ప్రభుత్వం గత ఏడాది 12 నెలల్లో తీసుకున్నదానికంటే 4.3 శాతం అధికంగా అప్పు చేయగా, తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం తీసుకున్న దానిలోంచి 98.45శాతం మొత్తాన్ని తీసుకుంది. ఇక కరోనా మహహ్మారి కారణంగా కూడా రాష్ట్రాలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్థికంగా చాలా వరకు ఇబ్బందుల్లో పడిపోయాయి. ఇప్పటికే పీకల్లోతుల వరకు అప్పుల్లో ఉంటే కరోనా మహమ్మారి తీవ్రమైన ప్రభావం చూపింది.

తెలుగు రాష్ట్రాల రుణాలు (కోట్లల్లో)

2018-19 ఏపీ 30,200 కోట్లు, తెలంగాణ 26,740 కోట్లు
2019-20 ఏపి 42,415 కోట్లు, తెలంగాణ 37,109 కోట్లు
2020-21 (డిసెంబర్‌ నాటికి) ఏపీ 44,250 కోట్లు, తెలంగాణ 36,534 కోట్లు.

ఇవి చదవండి :

కేంద్రం గుడ్‌న్యూస్‌.. జీఎస్టీ పరిహారంతో పాటు అదనపు రుణ సౌకర్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తెలుగు రాష్ట్రాలకు అదనపు రుణం

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. చివరి నిమిషంలో కండువా మార్చేస్తున్న అభ్యర్థులు..!

పట్టభద్రుల ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్.. ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమావేశం.. పార్టీ గెలుపుపై దిశానిర్ధేశం