Snake Bite: పాములు పగబట్టాయా? అన్నట్లు అక్కడ రెచ్చిపోయాయి. 24 గం.ల వ్యవధిలోనే ఐదుగురిన పొట్టనబెట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలోని వివిధ పాముకాటు ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా..వీరిలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది. మృతుల్లో ఎక్కువగా యుక్త వయస్కులే ఉన్నారు. మృతుల్లో 22, 28, 14, 18 ఏళ్ల వయస్కులు కూడా ఉన్నారు. పాము కాటుతో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపించారు. పాము కాటుకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు లేకపోవడం కూడా మృతుల సంఖ్య పెరగటానికి కారణంగా తెలుస్తోంది. 24 గం.ల వ్యవధిలోనే ఒకే జిల్లాలో ఐదుగురు వ్యక్తులు పాముకాటుతో మృతి చెందడం యూపీ వ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారింది.
యూపీ రాష్ట్ర వ్యాప్తంగానూ గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో పాముకాటు ఘటనలు నమోదయ్యాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో జనం పాముకాటుతో మృతి చెందారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పాములు బయటకు వస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో పాము కాటు ఘటనలు చోటుచేసుకోవడంతో సకాలంలో వారికి వైద్య చికిత్స కల్పించలేకపోతున్నారు. చికిత్స ఆలస్యం కావడంతో బాధితులు మృతి చెందుతున్నారు. వర్షాల నేపథ్యంలో పాము కాట్ల నివారణ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆ జిల్లా ప్రజలను సూచించారు. అటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటుకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. మిగిలిన జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను పాము కాటు చికిత్స పట్ల అప్రమత్తం చేశారు.
Also Read..
కట్నంగా తాబేళ్లు, గోర్లు, నల్ల కుక్క.. ఆర్మీ ఉద్యోగి వింత డిమాండ్. చివరకు ఏం జరిగిందంటే..
SC Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్లాట్‌ఫాం టికెట్ ధరల తగ్గింపు
అమ్మానాన్న తిడతారని పాము కరిచినా చెప్పలేదు.. పాపం చిన్నారి ప్రాణం..