దేశ యువత, పిల్లల భవిష్యత్తు కోసం తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం..! చట్టంగా మారేనా..?

అరచేతిలో ప్రపంచం ప్రజలకు అందుబాటులోకి ఉన్న ఈరోజుల్లో ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాలతో ప్రజలకు కలిగే లాభాలు ఉన్నట్లుగానే నష్టాలు అధికమవుతున్నాయి. పుట్టిన నెలల చిన్నారి మొదలు మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూస్తూ ఆహారం తినే నేటి జనరేషన్‌లో ప్రధానంగా 16 ఏళ్ల లోపు ఎదుగుతున్న పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం చాలా ప్రమాదకరంగా మారింది.

దేశ యువత, పిల్లల భవిష్యత్తు కోసం తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం..! చట్టంగా మారేనా..?
Ashwini Vaishnaw, Tdp Mp Lavu Srikrishna Devarayalu,

Edited By:

Updated on: Feb 11, 2026 | 10:05 AM

అరచేతిలో ప్రపంచం ప్రజలకు అందుబాటులోకి ఉన్న ఈరోజుల్లో ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాలతో ప్రజలకు కలిగే లాభాలు ఉన్నట్లుగానే నష్టాలు అధికమవుతున్నాయి. పుట్టిన నెలల చిన్నారి మొదలు మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూస్తూ ఆహారం తినే నేటి జనరేషన్‌లో ప్రధానంగా 16 ఏళ్ల లోపు ఎదుగుతున్న పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం చాలా ప్రమాదకరంగా మారింది. సోషల్ మీడియాలో వీడియోలకు ప్రభావితం కావడం.. ఎక్కువసేపు మొబైల్ తో గడపడం.. వీడియోలు, రీల్స్ ను అనుకరించడం.. అశ్లీల దృశ్యాలకు ప్రభావితం కావడం.. సామాజిక మాధ్యమాల వినియోగానికి ఆంక్షలు లేకపోవడంతో పిల్లల వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతున్న పరిస్థితి దేశంలో నెలకొంది. చిన్నారులు,16 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాల నుంచి రక్షించేందుకు టీడీపీ, సోషల్ మీడియా వినియోగం వయస్సు పరిమితుల పై చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతుంది.

టీడీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు..!

సోషల్ మీడియా వినియోగం వయస్సు పరిమితుల పై ఆన్‌లైన్ భద్రతపై త్వరలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. దీనికి సంబంధించి కేంద్ర ఐటీ, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి ప్రైవేట్ మెంబర్ బిల్లు కాపీని అందజేశారు. సోషల్ మీడియా యాక్సెస్ కోసం కనీస వయో పరిమితి, తప్పనిసరి వయస్సు-ధృవీకరణ విధానాలు, ధృవీకరణ సమయంలో సేకరించిన పిల్లల వ్యక్తిగత డేటాను శాశ్వతంగా తొలగించడం, నిబంధనలు పాటించనందుకు సామాజిక మాధ్యమాలపై జరిమానాలను ప్రతిపాదించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లు రూపొందించారు. పిల్లల సోషల్ మీడియా వినియోగం పై వయస్సు ఆధారిత నియంత్రణ విధానాలు తీసుకురావాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని NDA నేతృత్వంలోని ప్రభుత్వం ఈ అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోందని కేంద్రమంత్రికి తెలిపారు. ఆన్‌లైన్‌లో పిల్లలను రక్షించడానికి ఏపీ ప్రభుత్వం బలమైన చట్టపరమైన చర్యలను అన్వేషిస్తోందని కేంద్రమంత్రికి తెలిపారు. సోషల్ మీడియా వయస్సు ఆధారిత నియంత్రణను అధ్యయనం చేయడానికి, సమగ్ర జాతీయ విధానాన్ని సిఫార్సు చేయడానికి ఒక ప్రత్యేక కమిటీ లేదా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరిన లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు

దేశంలో పెరిగిన పిల్లల స్మార్ట్ ఫోన్ల వినియోగం!

భారతదేశంలో 14-16 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో దాదాపు 90 శాతం మంది ఇంట్లో స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. 75 శాతానికి పైగా పిల్లలు సోషల్ మీడియాను వినోదం కోసం ఉపయోగిస్తున్నారు. 60 శాతానికి పైగా మైనర్లు ఆన్‌లైన్ బెదిరింపులకు గురవుతున్నారు..వయస్సుకు తగని , హానికరమైన కంటెంట్‌కు ప్రభావితమవుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు రక్షణలు లేకుండా పిల్లల డేటాను సేకరించి డబ్బు ఆర్జిస్తున్నాయి. యుక్తవయస్కులలో పెరుగుతున్న ఆందోళన, నిరాశ సోషల్ మీడియాను అధికంగా వినియోగించేలా చేస్తుంది..దేశంలో ఇటీవల జరిగిన విషాద సంఘటనలు సోషల్ మీడియా ప్రభావ తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. డిజిటల్ వ్యసనం, సైబర్ బెదిరింపు, ఆన్‌లైన్ మానసిక క్షోభ కారణంగా మైనర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఘజియాబాద్, లక్నో కేసులు ఇందుకు నిదర్శనం..! 2025-26 ఆర్థిక సర్వే యువతలో పెరుగుతున్న డిజిటల్ వ్యసనాన్ని కూడా గుర్తించింది. అధికంగా సోషల్ మీడియా వినియోగం వల్ల మానసిక ఆరోగ్యం, పిల్లల ప్రవర్తన పై ప్రభావం చూపుతుంది.

సామాజిక మాధ్యమాలను నియంత్రిస్తున్న ప్రపంచ దేశాలు

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు నిబంధనలు ఉన్నాయి. ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌పై నిషేధం విధించింది. డెన్మార్క్, మలేషియా, నార్వే, యునైటెడ్ కింగ్‌డమ్, న్యూజిలాండ్ దేశాలు విస్తృత ఆన్‌లైన్ భద్రతా చర్యల్లో భాగంగా వయస్సు ఆధారిత పరిమితులను చురుకుగా పరిశీలిస్తున్నాయి. సోషల్ మీడియా వినియోగం బాధ్యత పూర్తిగా ప్లాట్‌ఫామ్‌లపైనే ఉండాలనే ప్రపంచవ్యాప్తంగా ఏకాభిప్రాయాన్ని ఆయా దేశాల చర్యలు ప్రతిబింబిస్తున్నాయి. పిల్లలపై తల్లిదండ్రుల నియంత్రణలు మాత్రమే సరిపోవు.. ప్రభుత్వ పరంగా చర్యలు ఉండాలన్నది టీడీపీ వాదనగా ఉంది. మరి ఈ విషయంలో భారత ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..