Tamil Nadu – VK Sasikala: తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ హోసూరు వద్దకు చేరుకున్నారు. అయితే శశికళ మళ్లీ అన్నాడీఎంకే జెండాతో ఎంట్రీ ఇవ్వడంతో.. దానిని తీసేయాలంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో శశికళ వర్గం ఆందోళనకు దిగడంతో తమిళనాడు సరిహద్దులోని హోసూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆమె జెండాను వినియోగించకూడదంటూ అధికార నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో భారీగా వాహనాలతో హోసూరుకు చేరుకున్న శశికళను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ఐదు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని.. జెండాను తీసేయాలంటూ పోలీసులు శశికళకు స్పష్టంచేశారు. ఈ తరుణంలో శశికళ వర్గం జెండాను తొలగించమంటూ పోలీసులకు అడ్డుపడింది.
ఇదిలాఉంటే.. శశికళ సోమవారం ఉదయం బెంగళూరు నుంచి చెన్నైకి బయలుదేరడంతో ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు వేలాది అభిమానులు ముందే హోసూరుకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో భారీగా పోలీసులను మోహరించారు. అయితే శశికళ చెన్నైకి చేరకునే క్రమంలో కొన్నిచోట్లనే ర్యాలీకి అనుమతించారు. అయితే జయలలిత స్మారకం దగ్గరికి శశికళకు అనుమతి లభించలేదు. దీంతో శశకళ ఎంజీఆర్ స్మారకం వద్దకు చేరుకుని నివాళులర్పించి ఇంటికి వెళ్లనున్నారు.
Also Read: