ఆ సీటు త్రిషదే.. విజయ్ మాస్టర్ ప్లాన్..! అరవ రాజకీయాల్లో సరికొత్త సంచలనం..

ఓట్ల లెక్కింపులో టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుంటే.. చెన్నై నీలన్‌కరైలోని విజయ్ నివాసం వద్ద అసలైన పొలిటికల్ డ్రామా మొదలైంది. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి త్రిష.. నేరుగా విజయ్ ఇంటికి చేరుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా త్రిష పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది.

ఆ సీటు త్రిషదే.. విజయ్ మాస్టర్ ప్లాన్..! అరవ రాజకీయాల్లో సరికొత్త సంచలనం..
Will Trisha Contest From Trichy East Or Perambur

Updated on: May 04, 2026 | 1:42 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ ప్రభంజనం సృష్టిస్తుండగా.. అందరి దృష్టి ఇప్పుడు నటి త్రిషపై మళ్లింది. ఇవాళే ఆమె పుట్టినరోజు కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో విజయ్ 100కు స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. దీంతో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఫిక్స్ అయిపోయింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బర్త్ డే సందర్భంగా దర్శించుకున్నారని ఆమె ఫ్యాన్స్ అంటుంటే.. విజయ్ గెలుపు కోసమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే తిరుమల దర్శనం తర్వాత ఆమె నేరుగా నీలన్‌కరైలోని విజయ్ నివాసానికి చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో విజయంపై ఆమె విజయ్‌కు అభినందనలు తెలిపారు.

విజయ్ త్రిష టార్గెట్‌గా విపక్షాల ప్రచారం

ఎన్నికల ప్రచార సమయంలో విజయ్, త్రిషల స్నేహాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్.. విజయ్, త్రిష ఇంటి నుండి బయటకు రావాలి అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. అయితే ఈ విమర్శలన్నింటినీ పక్కన పెట్టి ఓటర్లు టీవీకే వైపు మొగ్గు చూపడం గమనార్హం. ఈ నేపథ్యంలో విజయ్, త్రిష హ్యాష్ ట్యాగ్ నెట్టింట్ ట్రెండింగ్‌గా మారింది.

విజయ్ రాజీనామా చేసే స్థానంలో త్రిష..?

విజయ్ తాను పోటీ చేసిన తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్.. ఈ రెండు చోట్లా విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఒకవేళ రెండు చోట్లా గెలిస్తే, ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ఖాళీ అయ్యే స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థానంలో త్రిష పోటిచేస్తుందనే ప్రచారం ఊపందుకుంది. గతంలో టిక్కెట్ల కేటాయింపు విషయంలోనూ టీవీకే నేతలు త్రిష ఇంటి వద్ద క్యూ కట్టినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి పార్టీలో ఆమె ప్రాధాన్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొందరు మాత్రం విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖరన్ బరిలో ఉంటారని చెబుతున్నారు. కాగా విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుండగా త్రిష రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Follow Us