
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుప్పత్తూరు నియోజకవర్గ ఫలితం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ టీవీకే పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి శ్రీనివాస సేతుపతి, డీఎంకే సీనియర్ నేత, మంత్రి కేఆర్ పెరియకరుప్పన్‌పై కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సేతుపతికి 83,375 ఓట్లు రాగా, డీఎంకే అభ్యర్థి కేవలం 1 ఓట్లు స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
అయితే ఈ ఫలితం వెలువడిన వెంటనే, ఒమన్‌లోని మస్కట్‌లో పనిచేస్తున్న మణికందన్ శివానందం అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇంతకూ ఆ పోస్ట్ ఏముందంటే.. తన అభిమాన హీరో పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు తాను సుమారు 3,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఓమన్ నుంచి వచ్చి ఓటు వేసి నట్టు తెలిపాడు.
Booked my flight ticket to vote for TVK. Awake and hopeful — lots of prayers that the survey turns true on May 4th
— Manikandan Sivanantham (@mkxuv700) April 15, 2026
మణికందన్ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు.. తిరుప్పత్తూరు నియోజకవర్గంలో TVK కేవలం ఒక్క ఓటుతో గెలిచింది. నా అభిమాన నాయకుడు దళపతి విజయ్ పార్టీకి ఓటు వేయడం కోసం నేను మస్కట్ నుండి 3,000 కిలోమీటర్లు ప్రయాణించి రావడం నాకు చాలా గర్వంగా ఉందని రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి