సర్కార్ బస్సు డిజిటల్ బోర్డుపై అభ్యంతరకర రాతలు.. ఐదుగురు ఉద్యోగుల సస్పెన్షన్!

ప్రభుత్వ బస్సులో డీఎంకే, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను విమర్శిస్తూ డిజిటల్ బోర్డుపై అభ్యంతరకర సందేశాలు ప్రదర్శించబడ్డాయి. ఈ సంఘటన కడలూరులో చోటుచేసుకుంది, దీని వీడియో వైరల్‌గా మారింది. ఈ వివాదంలో ప్రాథమిక విచారణ అనంతరం ఐదుగురు రవాణా సంస్థ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు.

సర్కార్ బస్సు డిజిటల్ బోర్డుపై అభ్యంతరకర రాతలు.. ఐదుగురు ఉద్యోగుల సస్పెన్షన్!
Bus Led Display Controversy

Updated on: Oct 15, 2026 | 6:05 PM

కడలూరు: తమిళనాడులో ప్రభుత్వ బస్సుపై మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌, అధికార డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా అభ్యంతరకర సందేశాలు ప్రదర్శించడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై స్పందించిన రవాణా శాఖ అధికారులు ఐదుగురు ఉద్యోగులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. బస్సు వెనుక ఉన్న ఎల్‌ఈడీ డిజిటల్ బోర్డుపై ప్రదర్శించిన సందేశాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. పుదుచ్చేరి నుంచి కడలూరు, విరుధాచలం, పెరంబలూరు మీదుగా తిరుచ్చికి ప్రతిరోజూ ప్రభుత్వ బస్సు నడుస్తుంది. ఈ బస్సు వెనుక ఉన్న డిజిటల్ నేమ్‌బోర్డుపై ‘ఓం శక్తి పరాశక్తి’, ‘డీఎంకే ఒక దుష్టశక్తి’ వంటి సందేశాలు కనిపించాయి. బస్సును అనుసరిస్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఘటనపై తీవ్ర చర్చ మొదలైంది. ప్రాథమిక విచారణలో నేమ్‌బోర్డుకు వెళ్లే వైరును కత్తిరించి, కొందరు వ్యక్తులు దాని ద్వారా అభ్యంతరకర సందేశాలను ప్రదర్శించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనకు సంబంధించి విల్లుపురం రవాణా సంస్థకు చెందిన డ్రైవర్లు చిత్తిరైచల్వన్, పరంథమన్‌తో పాటు కండక్టర్లు సెంథమరై కన్నన్, వెంకటేశన్, మణికందన్‌లను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. వర్క్‌షాప్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలితే వారిపైనా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us