Suvendu Adhikari: బెంగాల్‌ కొత్త సీఎంగా సువేందు అధికారి.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?

Suvendu Adhikari to become West Bengal CM: బెంగాల్‌లో నూతన ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెలరపడింది. బెంగాల్‌ సీఎంగా సువేందుకు అధికారి ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసబాపక్ష సమావేశంలో హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో సువేందు అధికారిని సీఎంగా ఎన్నుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

Suvendu Adhikari: బెంగాల్‌ కొత్త సీఎంగా సువేందు అధికారి.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
Suvendu Adhikari To Become West Bengal Cm

Updated on: May 08, 2026 | 5:03 PM

అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. బెంగాల్‌ కొత్త సీఎంగా  సువేందు అధికారిని బీజేపీ శాసన సభాపక్ష సమావేశంలో ఎన్నుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం స్వీకారం చేయనున్నారు. కోల్‌కతా విశ్వబంధు కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన బీజేపీ శాసనసభా సమావేశంలో సువేందు అధికారిని నేతగా ఎన్నుకున్నారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలో  బీజేపీ సీనియర్‌ నేత దిలీప్‌ ఘోష్‌ ఆయన పేరును ప్రతిపాదించారు.

ఇదిలా ఉండగా ఓ మహిళతో సహా ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వబోతున్నారు. శనివారం ఉదయం కోల్‌కతా బ్రిగేడ్‌ గ్రౌండ్స్‌లో కొత్త సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. పోలీసులు ఇప్పటికే బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఎవరూ ఈ సువేందు అధికారి.. 

సుదేందు అధికారి.. ఈయన గతంలో మమత బెనర్జీకి కుడిభుజంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఇతను టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత మమతా బెనర్జీకి వ్యతిరేకంగా విపక్ష నేతగా వ్యవహరించారు. ఇతను రెండు సార్లు మమతా బెనర్జీపై పోటీ చేసి విజయం సాధించారు. 2021లొ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రాం నుంచి పోటీ చేసిన సువేందు.. మమతా బెనర్జీని ఒడించగా.. తాజాగా జరిగిన 2026 ఎన్నికల్లో మరోసా మమతా సొంత నియోజకవర్గమైనా భవనీపూర్‌లో నుంచి పోటీ చేసి దాదాపు 15 మెజార్టీతో ఆమెపై విజయం సాధించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us