Rahul Dravid Video: ప్రపంచ క్రికెట్‌లో నిజమైన జెంటిల్‌మ్యాన్, నిదానపరుడు, శాంతపరుడు ఎవరంటే ఎవరైనాసరే భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ అని చెబుతారు. క్రమశిక్షణకు మారుపేరుగా ద్రావిడ్‌ను పేర్కొంటారు. ద్రావిడ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి జట్టు వారు అతన్ని రెచ్చగొట్టడానికి ఎంత ప్రయత్నించినా.. నోటితో కాకుండా.. తన బ్యాటింగ్‌తో ఆన్సర్ ఇచ్చేవాడు. టీమిండియా జట్టులో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న రాహుల్ ద్రావిడ్.. ఏనాడూ బౌలర్లపై దురుసుగా ప్రవర్శించలేదు. ఎవరితోనై కలహానికి కయ్యం దువ్వలేదు. కానీ, తాజాగా రాహుల్ ద్రావిడ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. నడిరోడ్డుపై బ్యాట్‌తో హల్‌చల్ చేశాడు. ‘ఇందిరానగర్ కా గూండా’ ఊగిపోయాడు. అయితే, ఆ కోపం నిజం కాదులేండి. ఒక సంస్థ కోసం రూపొందించిన యాడ్‌లో రాహుల్ ద్రావిడ్ ఇలా నటించాడు అంతే. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే, ఈ వీడియోను సూరత్ పోలీసులు అద్భుతంగా వినియోగించుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికోసం రాహుల్ ద్రావిడ్ శైలిని వినియోగించుకున్నారు. రాహుల్ ద్రావిడ్ ఫోటోను సోషల్ మీడియాలో షోర్ చేసిన సూరత్ పోలీసులు.. ఆ షోటోసౌ ‘ఇందిరానగర్ నుంచి వచ్చినా.. సూరత్ నుంచి వచ్చినా.. రోడ్డుపై గూండాగిరిని ఒప్పుకునేది లేదు’ అని కొటేషన్ పెట్టారు. దాంతోపాటు.. ‘గూండాగిరి సినిమాల్లోనే బాగుంటుంది.. రోడ్డుపై కాదు’ అని సూరత్ పోలీసులు క్యాప్షన్ పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి వార్నింగ్ ఇవ్వడం కోసం సూరత్ పోలీసులు ఇలా ద్రావిడ్ ఫోటోను వినియోగించినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
కాగా, సూరత్ పోలీసులు షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. పోలీసుల టైమింగ్‌ని ప్రశంసిస్తున్నారు. ఉల్లంఘనులకు వార్నింగ్ ఇవ్వడానికి ఇది చక్కటి మార్గం అని పేర్కొంటున్నారు.
Surat City Police Instagram:
Also read:
Akhil Movie: టాలీవుడ్ యంగ్ హీరో కోసం సూపర్ స్టార్.. అఖిల్ ఏజెంట్ కోసం స్పెషల్ రోల్లో…
కారులో కరెన్సీ కట్టలను కాల్చుకున్న చరిత్ర మాది కాదు : టీవీ9 కిచ్చిన ఇంటర్వూలో మంత్రి జగదీష్ రెడ్డి