Surat Business Man : చంద్రుడిపై ఎకరం స్థలం కొనుగోలు చేసిన సూరత్ వ్యాపారి.. ఎలా విక్రయించాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

|

Mar 26, 2021 | 3:49 PM

Surat Business Man : ఏ తండ్రి అయినా తన పిల్లల కోసం ఆస్తి కొనుగోలు చేయడం సహజంగా జరిగే ప్రక్రియ. ఎందుకంటే తను పడిన కష్టం తన పిల్లలు పడవద్దనే

Surat Business Man : చంద్రుడిపై ఎకరం స్థలం కొనుగోలు చేసిన సూరత్ వ్యాపారి.. ఎలా విక్రయించాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Surat Business Man
Follow us on

Surat Business Man : ఏ తండ్రి అయినా తన పిల్లల కోసం ఆస్తి కొనుగోలు చేయడం సహజంగా జరిగే ప్రక్రియ. ఎందుకంటే తను పడిన కష్టం తన పిల్లలు పడవద్దనే ఉద్ధేశ్యంతో చాలామంది పిల్లల కోసం ఎంతో కొంత కూడబెడుతూ ఉంటారు. దాంతో వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ తండ్రి మాత్రం తన రెండు నెలల కుమారుడి కోసం అద్భుతమైన గిఫ్ట్ తయారుచేశాడు. ఏకంగా చంద్రుడిపైనే స్థలం కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన విజయ్‌ భాయ్‌ కథిరియా అనే వ్యాపారి తన రెండు నెలల కుమారుడు నిత్య కోసం చంద్రుడిపై స్థలం విక్రయించాలనుకున్నాడు. ఇందుకోసం న్యూయార్క్‌లోని ఇంటర్‌నేషనల్‌ లూనార్‌ రిజిస్ట్రీకి మెయిల్‌ పెట్టాడు. మార్చి 13వ తేదీన అనుమతులు వచ్చాయి. అయితే సదరు కంపెనీ నుంచి విజయ్‌ కుమారుడు నిత్య పేరిట ఓ ఎకరం స్థలం కొన్నట్లు సర్టిఫికేట్లు వచ్చాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మామూలుగా చంద్రుడిపై స్థలం ఎలా కొనుగోలు చేస్తారనే అనుమానం అందరికి వస్తుంది అది అసలు నిజమేనా.. అని అందరు అనుకుంటారు.. అసలు విక్రయించే వాళ్లు ఎవరంటూ కొందరు ప్రశ్నిస్తారు. సాధారణంగా చంద్రుడిపై స్థలం కొనుగోలు చేయడం సాధ్యపడదు.అయితే చంద్రుడిపై స్థలం కొన్నట్లు ఓ సర్టిఫికేట్‌ను మాత్రమే సంపాదించగలం. చాలా మంది దీన్ని ఓ విలువైన బహుమతిగా భావిస్తుంటారు. గతంలో కూడా ఓ వ్యక్తి తన భార్యకు మూడెకరాలు కొన్నట్లు సర్టిఫికెట్స్ తయారుచేసి ఇచ్చిన విషయం తెలిసిందే.

Bengaluru Crime : మంచం కింద ఆరు గంటల పాటు దాక్కొని మట్టుబెట్టాడు.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..

PM Kisan Samman Nidhi: రైతులకు డబుల్‌ బెనిఫిట్స్‌.. మార్చి 31లోగా చేరండి.. బ్యాంకు ఖాతాలో రూ.4 వేలు పొందండి

చేసింది ఒకే సినిమా.. కానీ అవకాశాలు మాత్రం బోలేడు.. నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన యంగ్ హీరో..