Supreme Court: యూట్యూబ్, వెబ్ పోర్టళ్లు, సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

|

Sep 02, 2021 | 1:07 PM

సోషల్ మీడియా... మన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పుకునే ప్లాట్ ఫామ్. మంచి కోసం వాడుకుంటే దీనికి మించిన మంచి వేదిక, ఆయుధంc

Supreme Court: యూట్యూబ్, వెబ్ పోర్టళ్లు, సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
Supreme Court
Follow us on

Social media: సోషల్ మీడియా… మన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పుకునే ప్లాట్ ఫామ్. మంచి కోసం వాడుకుంటే దీనికి మించిన మంచి వేదిక, ఆయుధం ఇంకేమీ ఉండదు. కానీ, కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటూ సమాజంలో చిచ్చు పెడుతున్నారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు.

మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇవాళ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్ల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. జవాబుదారీతనం లేకపోవడంతో వ్యక్తుల పరువుకు నష్టం కలుగుతోందంటూ వ్యాఖ్యానించింది. నియంత్రణా వ్యవస్థ లేకపోవడంతో వెబ్ పోర్టళ్లు దేన్నయినా ప్రచురించగలుగుతున్నాయని అభిప్రాయపడింది. ఇది, దేశానికి ఎంతో ప్రమాదకరమని సీజేఐ అభిప్రాయపడ్డారు.

దేశంలో జరిగే ప్రతి విషయాన్నీ మత కోణంలో చూపుతున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతి అంశాన్నీ మత కోణంలో చూపడం వల్లే ప్రజల మధ్య విద్వేషాలకు, దేశంలో అలజడులకు కారణమవుతోందన్నారు.

Read also:  Nagarkurnool: గుత్తేదార్ల గుట్టు రట్టైంది.. కోట్ల రూపాయల ప్రజా సంపద కొట్టుకుపోయి సాక్ష్యంగా నిలిచింది