పంజాబ్ లోని జలాలాబాద్ లో శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అయన ప్రయాణిస్తున్న వాహనంపై ఓ గుంపు రాళ్ళ వర్షం కురిపించింది. ఈ ఉద్రిక్తత లో కొన్ని గన్ షాట్స్ కూడా వినిపించాయి. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు కొందరు అభ్యర్థులతో ఆయన వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఎటాక్ ని ఖండించిన శిరోమణి అకాలీదళ్ వర్గాలు., ఈ ఘటనలో కొంతమంది కార్యకర్తలకు బుల్లెట్ గాయాలైనట్టు తెలిపాయి. పోలీసుల మద్దతుతో కాంగ్రెస్ గూండాలు బాదల్ పై హత్యా యత్నం చేశారని ఈ వర్గాలు ఆరోపించాయి. బాదల్ ను రక్షించడానికి ముగ్గురు కార్యకర్తలు పరుగులు తీయగా వారిపై కాల్పులు జరిగినట్టు పేర్కొన్నాయి. అయితే బాదల్ దీనిపై స్పందించలేదు. ఈ దాడి తాలూకు వీడియో వైరల్ అవుతోంది.
#WATCH | Shiromani Akali Dal (SAD) president Sukhbir Singh Badal’s vehicle attacked in Jalalabad, Punjab.
(Note: Strong language) pic.twitter.com/kH9HWL9ZPg
— ANI (@ANI) February 2, 2021