స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా స్టాచ్యూ ఆఫ్ యూనిటీయే మిన్న ఇక టూరిస్టులు వెల్లువెత్తడం ఖాయం ప్రధాని మోదీ

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీయే మిన్న అని ప్రధాని మోదీ తెలిపారు. దీన్నే ఎక్కువమంది..

  • Umakanth Rao
  • Publish Date - 4:23 pm, Sun, 17 January 21
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా స్టాచ్యూ ఆఫ్ యూనిటీయే మిన్న  ఇక టూరిస్టులు వెల్లువెత్తడం ఖాయం  ప్రధాని మోదీ

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీయే మిన్న అని ప్రధాని మోదీ తెలిపారు. దీన్నే ఎక్కువమంది టూరిస్టులు విజిట్ చేస్తున్నారని ఆయన చెప్పారు. రెండేళ్ల క్రితం దీన్ని లాంచ్ చేసినప్పటినుంచి దాదాపు 50 లక్షలమంది టూరిస్టులు దీన్ని సందర్శించినట్టు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా కెవాడియాకు వీడియో కాన్ఫరెన్స్  ద్వారా 8 రైలు సర్వీసులను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మోదీ..ఇక ఈ ట్రెయిన్ సౌకర్యంతో రోజూ లక్షమందికి పైగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తారని  చెప్పారు. సర్దార్ వల్లభ భాయ్ పటేల్ 143 వ జయంతిని పురస్కరించుకుని 2018 అక్టోబరులో ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ప్రారంభించారు. ఈ ఏరియాలోని ఇతర సెంటర్లను విజిట్ చేసినవారు ఈ నూతన రైలు సర్వీసుల వల్ల ప్రయోజనం పొందుతారని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు కెవాడియా గుజరాత్ లోని మారుమూల ప్రాంతం కాదని, ఇది వరల్డ్ లోనే అతి పెద్ద టూరిస్టు డెస్టినేషన్ కానుందని ఆయన అన్నారు.  ఇక్కడ ఇక నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరగనున్నాయని ఆయన చెప్పారు.

నెవాడియాలో నెలకొల్పిన సర్దార్ వల్లభ భాయ్ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇప్పటివరకు నేవాడియా గురించి తెలియనివారికి కూడా ఇప్పుడు 8 ట్రెయిన్ సర్వీసుల ప్రారంభంతో ఇది పాపులర్ కాబోతోంది.

Also Read:

Covid Caller Tune : ఇప్పుడు ఆ గొంతు వినిపించడం లేదు.. మరిన్ని సూచనలతో కొత్త ట్యూన్​ వినిపిస్తోంది..

రైతు చట్టాలను చాలామంది అన్నదాతలు సమర్థించారు, పరిష్కారం కనుచూపు మేరలో ఉందని ఆశిస్తున్నా, కేంద్ర మంత్రి తోమర్

COVID-19 vaccine: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇన్‌ఫెక్షన్‌ మంచిదే.. భయపడాల్సిన పని లేదన్న ఎయిమ్స్‌ డైరెక్టర్