
ఆయనకు కొంచెం తిక్కుంది. కానీ ఆ తిక్కకు ఓ లెక్కే లేకపోయింది. ఎస్.. ఆయన్ను మెంటల్ మస్క్ అని ఎందుకంటారో ప్రపంచానికి మరోసారి తెలిసొచ్చింది. కానీ, ఇక్కడ అత్యంత విషాదం ఏంటంటే, ఈ అపర కుబేరుడు ఆడే పక్కా కమర్షియల్ రియాలిటీ షోలో మన దేశప్రతిష్ట భంగపడ్డం.. మన ప్రభుత్వాధినేతల మీద మచ్చ పడ్డం.. మన మేక్ ఇన్ ఇండియా స్లోగన్ మసకబారడం. స్టార్‌లింక్ ఇన్ వెనిజులా.. అవును, వెనిజులాలో కూడా కాలుబెట్టేశాం.. కొద్ది గంటల కిందటే ఎలోన్ మస్క్ సగర్వంగా చేసిన పోస్ట్ ఇది. మా దేశమంతటా శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చెయ్యడానికి స్టార్‌లింక్‌కు బేషరతుగా అనుమతినిస్తున్నాం.. అని వెనిజులా టెలికమ్ రెగ్యులేటర్ కోనాటెల్ చేసిన అనౌన్స్‌మెంట్‌ను ట్యాగ్ చేస్తూ, మీసం మెలేశాడు ఎలోన్ మస్క్. కానీ, వెనిజులాను మస్క్‌సారు అంత ఈజీగా ఎలా లొంగదీసుకున్నాడు అని మిగతా దేశాలన్నీ కాసేపు జుట్టు పీక్కున్నా్యి. కానీ, దానికీ ఓ లెక్కుంది. ఈ ఏడాది జూన్‌లో భారీ భూకంపం వచ్చి కునారిల్లిపోయిన వెనిజులాలో ఫోన్లు ఆగిపోయి, ఇంటర్నెట్ తెగిపోతే, 1600 ఎమర్జెన్సీ కిట్స్‌ని, మెడికల్ టీమ్స్‌ని పంపించి, నేనున్నానంటూ ఫోజుకొట్టి, అక్కడి రెస్క్యూ పనుల్లో ఆదుకున్నాడట. దాంతోనే ఫిదా ఐపోయి స్టార్‌లింక్‌కు తమ దేశంలో...