పండుగలు వచ్చాయంటే చాలు.. ప్రయాణాల బిజీలో ఉంటారు. చాలా మంది రైలు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే రైలు టికెట్ బుక్ చేసుకోవాలంటే మూడు నుంచి 4 నెలల ముందే బుక్ చేసుకోవల్సి ఉంటుంది. లేదంటే పండుగలు దగ్గర పడుతున్న కొద్ది.. చాంతాడంత వెయిట్ లిస్ట్ ఉంటుంది. ఇక తప్పక బస్సు టికెట్లు బుక్ చేసుకోవల్సి ఉంటుంది. అయితే క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లలో సీట్లు కూడా ఖాళీలున్నాయి. బస్సు ప్రయాణంతో పోలిస్తే రైలు ప్రయాణం ధర తక్కువే కాకుండా, సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతో చాలా మంది ట్రైన్ జర్నీకి ఇష్టపడతారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల ప్రకటనతో రైలు ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందించింది. నరసాపురం నుంచి సికింద్రాబాద్, యశ్వంత్ పూర్‌లకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. నరసాపురం-సికింద్రాబాద్ రైలులో స్లీపర్, ఏసీ క్లాస్ టిక్కెట్ల ఖాళీలు ఉండగా, సికింద్రాబాద్-నరసాపురం రైలులో స్లీపర్ క్లాస్ లో ఆర్‌ఎసీ ఉండగా, ఎసీలో టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక రైళ్లు ఏయే మార్గాల్లో ఏయే తేదీల్లో నడవనున్నాయో తెలుసుకుందాం.
రైలు నెంబర్ 07466 నరసాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు.. ఈనెల 22వ తేదీన నరసాపూర్‌లో సాయంత్రం 6గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4గంటల10 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివా, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది.
రైలు నెంబర్ 07439 సికింద్రాబాద్ నుంచి నరసాపూర్ వరకు .. ఈ నెల 23వ తేదీ రాత్రి 10గంటల 35 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నరసాపూర్ చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు మీదుగా ప్రయాణించనుంది.
రైలు నెంబర్ 07687 నరసాపూర్ నుంచి యశ్వంత్ పూర్ వరకు ఈనెల 25వ తేదీన నడవనుంది. ఈ రైలు 25వ తేదీ మధ్యాహ్నం 3గంటల 10 నిమిషాలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10గంటల 50 నిమిషాలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసారావుపేట, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్ జంక్షన్, అనంతపూర్, ధర్మవరం, పెనుకొండ, హిందూపూర్, యలహంక మీదుగా నడవనుంది.
రైలు నెంబర్ 07688 యశ్వంత్ పూర్ నుంచి నరసాపూర్ వరకు నడవనుంది. ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం 3గంటల50 నిమిషాలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8గంటల 30 నిమిషాలకు నరసాపూర్ చేరుకోనుంది. ఈ రైలు యలహంక, హిందూపూర్, పెనుకొండ, ధర్మవరం, అనంతపూర్, డోన్, నంద్యాల, గిద్దలూరు, మార్కాపూర్, దొనకొండ, నరసారావుపేట, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు మీదుగా నడవనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..