Sonu sood: మరో అరుదైన గౌరవం అందుకున్న సోనూసూద్.. సొంత రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడార్ గా నియామకం!

|

Apr 11, 2021 | 7:54 PM

సోనూ సూద్ .. ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఉండిపోయిన పేరు.

Sonu sood: మరో అరుదైన గౌరవం అందుకున్న సోనూసూద్.. సొంత రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడార్ గా నియామకం!
Sonusood
Follow us on

సోనూ సూద్ .. ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఉండిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వెలది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్చందంగా ఆడుకున్న సోనూసూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు సోనూ సూద్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. పంజాబ్ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూ సూద్ ను నియమిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్ ను నియమించినట్టు అయన తెలిపారు. ” ‘ గొప్ప పరోపకారి, నటుడు సోనూ సూద్‌ని కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారని చెప్పేందుకు చాలా సంతోషిస్తున్నాను. ఆయన మద్దతుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్క పంజాబీ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకుని కరోనా నుంచి రక్షణ పొందాలి’’ అని పంజాబ్ సీఎం అమరీందర్ ట్వీట్ చేశారు.

కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవడంతో పంజాబీలు అయిష్టంగా ఉన్నారని చెప్పిన ముఖ్యమంత్రి.. తమ ప్రజలను వ్యాక్సిన్ వేసుకునేలా సోనూ సూద్ ప్రభావితం చేయగలరని ఆకాంక్షించారు. కరోనా సమయంలో వేలాది మంది వలస కార్మికులను సొంతూళ్లకు పంపడంలో సోనూ సూద్ సేవలను ఆయన ప్రశంసించారు. సోనూ సూద్ సీఎం అమరీందర్‌ను కలిసిన మరుసటి రోజే బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం విశేషం. సోనూ సూద్‌ స్వస్థలం పంజాబ్‌లోని మోగా.

Also read: Remdesivir : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్‌ ఎగుమతులపై నిషేధం

Old Treasure: ఆ ప్రాచీన మఠంలో రహస్య గదులు..అమూల్యమైన సొత్తు..పదేళ్ల తరువాత మళ్ళీ వెలుగులోకి.. ఎక్కడంటే..