Smriti Irani shares shehnaaz gills viral video: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం ఓ వైరల్ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. నటి షెహనాజ్ గిల్ వైరల్ డైలాగ్‌ను యశ్‌రాజ్ ముఖటే షేర్ చేశారు. దానిని ఒకప్పటి నటి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బిగ్‌బాస్‌లో షెహనాజ్ గిల్ పంచుకున్న వ్యాఖ్యలను ఆలోచించాలంటూ స్మృతి ఇరానీ ఇన్‌స్టాలో రాశారు. నాకు ఫీలింగ్స్ ఉండవా.. మంచి కుక్క టామీ.. చెడ్డ కుక్క.. కుక్క అంటూ దానిలో షెహనాజ్ పేర్కొంటుంది. అయితే ముందుగా వీడియోను మ్యూజిక్ డైరెక్టర్ యశ్‌రాజ్ ముఖాటే మాష్-అప్ చేసిన తరువాత ఇదీ వైరల్‌గా మారింది. ఈ దేశీ వీడియోకు ప్రాధాన్యమిస్తూ.. స్మృతి షెహనాజ్ భావాలపై దృష్టి పెట్టాలంటూ ఫాలోవర్లను కోరారు. ఈ సందర్భంగా ఆమె పలు కామెంట్లు కూడా చేశారు.
ఈ క్రమంలో పాకిస్తాన్ ఇన్‌ఫ్లుయెన్సర్ దానీర్ మొబీన్ షేర్ చేసిన పవ్రీ వీడియో వారంలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ట్రెండింగ్‌గా మారిన అనంతరం కేంద్ర మంత్రి ఈ కామెంట్లు చేశారు. పాకిస్తాన్ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ట్రెండ్ వీడియోకు తాను ఆలస్యమయ్యానని.. కానీ పవ్రీ కన్నా దేశీ వీడియోను ఆదరించాలని ఆమె కోరారు. అంతేకాకుండా షెహనాజ్ భావాలను కూడా ఆలోచించాలని ఆమె కోరారు.