కరోనా లాక్‌డౌన్‌‌.. 66 లక్షల మంది ఉద్యోగాలు పోయాయట

| Edited By:

Sep 18, 2020 | 8:06 AM

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే నుంచి ఆగష్టు మధ్యలో

కరోనా లాక్‌డౌన్‌‌.. 66 లక్షల మంది ఉద్యోగాలు పోయాయట
Follow us on

Job lost Corona Lockdown: కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే నుంచి ఆగష్టు మధ్యలో 66 లక్షల వైట్ కాలర్ ఉద్యోగాలు ఊడిపోయాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తెలిపింది. వీరిలో ఇంజనీర్లు, ఫిజీషియన్లు, ఉపాధ్యాయులు ఉన్నారు. వీరితో పాటు పరిశ్రమలకు చెందిన 50 లక్షల మంది కార్మికులు పని కోల్పోయారని సీఎంఐఈ వెల్లడించింది. ఇక ఇందులో అర్హత కలిగిన స్వయం ఉపాధి నైపుణ్యం ఉన్న వ్యాపారవేత్తలను కలపలేదని తెలిపింది.

2016 నుంచి ఇదే అత్యల్పమని, గత నాలుగేళ్ల కాలంలో పొందిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయని సీఎంఐఈ పేర్కొంది. ఇదిలా ఉంటే కరోనాతో వైట్ కాలర్ క్లరికల్‌ ఉద్యోగుల మీద ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపింది. డెస్క్ వర్క్‌, ఆఫీస్ క్లర్స్క్‌, బీపీఓ/కేపీఓ వర్కర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇంటి దగ్గర నుంచే పనిచేసి ఉండొచ్చని విశ్లేషణలో వెల్లడించింది.

Read More:

ఛీ ఛీ అన్న అభిజిత్‌.. గుక్కపెట్టి ఏడ్చేసిన సుజాత

ఏపీలో 1,658 మంది ఖైదీలకు కరోనా.. కడప జైల్‌లో అత్యధిక కేసులు