AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హస్తానికి హ్యాండ్ ఇవ్వనున్న మరో సీనియర్ నేత !

ఇటీవల జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ ను వీడిన నేప‌థ్యంలో ఇంకా అనేక మంది ప్ర‌ముఖులు కూడా కాంగ్రెస్ ను వీడ‌వ‌చ్చ‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ..

హస్తానికి హ్యాండ్ ఇవ్వనున్న మరో సీనియర్ నేత !
Jyothi Gadda
| Edited By: |

Updated on: Mar 13, 2020 | 12:52 PM

Share

హస్తం పార్టీలో మొదలైన వలసలు ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించటం లేదు. ఇంకా పార్టీలో పలువురు కీలక నేతలు హస్తాన్ని వీడనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ ను వీడిన నేప‌థ్యంలో ఇంకా అనేక మంది ప్ర‌ముఖులు కూడా కాంగ్రెస్ ను వీడ‌వ‌చ్చ‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కూడా త్వరలోనే హస్తాన్ని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీకి దేశ వ్యాప్తంగా వ్య‌తిరేక గాలులు వీచిన సమయంలో కూడా శ‌శిథరూర్ వ‌రుసగా ఎంపీగా నెగ్గుతూ వ‌చ్చారు. అంతటి ఉద్దండ నేత కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి కమలం గూటికి చేరుతారన్న వార్తలు.. పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు రేపుతోంది.

ఇదిలా ఉంటే.. కేరళలో బీజేపీ బలం పెంచుకునేందుకు గట్టిప్రయత్నాలే చేస్తోంది. పినరయ్ సర్కార్‌కు చెక్ పెట్టాలంటే.. బలమైన నేతలు కావాల్సిందే. ఈ క్రమంలో ఇతర పార్టీల నేతలకు బీజేపీ గాలం వేస్తోందన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ శశిథరూర్ ను తమవైపుకు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కోలుకుంటుందన్న ఆశ సీనియర్ నాయకుల్లో లేకపోవడం.. ఇక శశిపై ఉన్న కేసుల నేపథ్యంలో బీజేపీలో చేరతున్నారేమోనన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పార్టీ మారే ఆలోచన తనకు లేదని, బీజేపీలో అయితే చేరే ప్రసక్తే లేదని శశిథరూర్ స్పష్టం చేశారు.

Follow Us
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు