డాక్టర్లను నేను కించపరచలేదు, శివసేన నేత సంజయ్ రౌత్

డాక్టర్లను తాను కించపరచలేదని శివసేన నేత సంజయ్ రౌత్ తనను తాను సమర్థించుకున్నారు. కాంపౌండర్ల కన్నా డాక్టర్లకు ఏమీ తెలియదని, తనకు మందులు అవసరమైనప్పుడల్లా..

డాక్టర్లను నేను కించపరచలేదు, శివసేన నేత సంజయ్ రౌత్

Edited By:

Updated on: Aug 18, 2020 | 5:13 PM

డాక్టర్లను తాను కించపరచలేదని శివసేన నేత సంజయ్ రౌత్ తనను తాను సమర్థించుకున్నారు. కాంపౌండర్ల కన్నా డాక్టర్లకు ఏమీ తెలియదని, తనకు మందులు అవసరమైనప్పుడల్లా కాంపౌండర్ల నుంచే తీసుకుంటానని ఇటీవల ఆయన వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై మహారాష్ట్ర వైద్య మండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఏకంగా సీఎం ఉధ్ధవ్ థాక్రేకే లేఖ రాసింది. మీ ఉద్దేశం కూడా ఇదేనా అని ఈ మండలి సభ్యులైన డాక్టర్లు ప్రశ్నించారు. అయితే దీనిపై పెద్ద దుమారం రేగడంతో సంజయ్ రౌత్ మంగళవారం వివరణ ఇస్తూ.. వైద్యులను నేను అవమానించలేదని, అందులోనూ ఈ కరోనా తరుణంలో వైద్య బృందం అందిస్తున్న సేవలు అమోఘమని అన్నారు. డాక్టర్లను ఉద్దేశించి నేను ఈ మధ్య చేసిన వ్యాఖ్య..ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరుపైనే అన్నారాయన.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సమర్థంగా వ్యవహరించి ఉంటే కోవిడ్ ఇంతగా విజృంభించేదే కాదని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.