23 ఏళ్ళ యువ రెజ్లర్ సాగర్ రానా మృతి కేసులో ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. కాగా సాగర్ మరణానికి అతని తలపై బలమైన వస్తువుతో కొట్టడం వల్లే అతడు మరణించాడని పోస్టు మార్టం నివేదికలో పేర్కొన్నారు. ఛత్రసాల్ స్టేడియం వద్ద జరిగిన ఘర్షణలో అతని కాళ్ళు, చేతులు, ఛాతీ, బొడ్డు భాగంపై గాయాలున్నట్టు ఈ రిపోర్టు పేర్కొంది. ముఖ్యంగా తలపై తగిలిన గాయం కారణంగా సెలబ్రెల్ డ్యామేజీ జరిగిందని, ఇందులో ఫోరెన్సిక్ నిపుణుల బృందం తెలిపింది. అటు ఈ దాడి విషయంలో తనకు సాయపడేందుకు సుశీల్ కుమార్ జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్లలో ఒకడైన నీరజ్ బవానా అనే వ్యక్తితో బాటు మరికొందరు పహిల్వాన్లను కూడా రప్పించాడని తెలుస్థోంది. సాగర్ రానా మృతికి దారి తీసిన కారణాలను మంగళవారం ఈ పోస్టు మార్టం నివేదికలో వెల్లడించారని పోలీసులు పేర్కొన్నారు. ఇలా ఉండగా సుశీల్ కుమార్ ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నార్తర్న్ రైల్వే అధికారులు ప్రకటించారు. అతడు అరెస్టయి 48 గంటలు గడిచిపోయాయని, ఈ కారణంగా సస్పెండ్ చేస్తున్నామని వ్ వారు తెలిపారు.
ఇలా సుశీల్ కుమార్ చుట్టూ అతని మనుగడను దెబ్బ తీసే పరిణామాలు వరుసగా జరుగుతున్నాయి. తనకు ఏ గ్యాంగ్ స్టర్ తోనూ సంబంధాలు లేవని అతడు పోలీసు ఇంటరాగేషన్ సందర్భంగా చెప్పిన మాట అబద్దమని తేలిపోయింది.ఛత్రసాల్ స్టేడియం వద్ద మంగళవారం పోలీసులు అతని చేత సీన్ రీ కన్ స్ట్రక్షన్ కూడా చేయించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దేశంలో విపరీత ప్రాణ నష్టం, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫైర్, ‘ఎవరు బాధ్యులు’ అంటూ ఫేస్ బుక్ ‘ఉద్యమం’ !