సచిన్‌కు సెక్యూరిటీను రద్దు చేసిన ‘మహా’ సర్కార్!

|

Dec 25, 2019 | 7:49 PM

మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌కు పోలీసు సెక్యూరిటీని మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. సచిన్‌కు ఇప్పటి వరకు ఉన్న ఎక్స్ కేటగిరీ భద్రతను ఎత్తివేసింది. వివిధ వ్యక్తులకు కల్పిస్తున్న భద్రతపై పోలీసు ఉన్నతాధికారుల కమిటీ సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకుంది. సచిన్‌కు 24 గంటల పాటు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించి ఆయన పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రం భద్రత కల్పించాలని మహారాష్ట్ర పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. హర్భజన్ సింగ్, సచిన్‌కు సంబంధించిన భద్రతను తొలగించడమే కాకుండా ఇంకొంతమంది నాయకుల […]

సచిన్‌కు సెక్యూరిటీను రద్దు చేసిన మహా సర్కార్!
Follow us on

మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌కు పోలీసు సెక్యూరిటీని మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. సచిన్‌కు ఇప్పటి వరకు ఉన్న ఎక్స్ కేటగిరీ భద్రతను ఎత్తివేసింది. వివిధ వ్యక్తులకు కల్పిస్తున్న భద్రతపై పోలీసు ఉన్నతాధికారుల కమిటీ సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకుంది. సచిన్‌కు 24 గంటల పాటు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించి ఆయన పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రం భద్రత కల్పించాలని మహారాష్ట్ర పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

హర్భజన్ సింగ్, సచిన్‌కు సంబంధించిన భద్రతను తొలగించడమే కాకుండా ఇంకొంతమంది నాయకుల భద్రతల విషయంలో కొన్ని మార్పులు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. వీరిలో ముఖ్యంగా బీజేపీ నాయకుడు ఏక్‌నాథ్ ఖాడ్సేకు గతంలో ఉన్న వై కేటగిరితో పాటు ఎస్కార్టు భద్రతను కుదించింది. యూపీ మాజీ గవర్నర్, మాజీ బీజేపీ నాయకుడు రాంనాయక్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండగా.. దాన్ని ఎక్స్ కేటగిరికి కుదించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికంకు వై కేటగిరిని కేటాయించింది. ఈయనకు ఇది వరకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండేది. కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య థాకరేకు ప్రస్తుతం ఉన్న వై కేటగిరీ భద్రతను జడ్‌ కేటగిరీకి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.