Viral: దేవుడున్నాడు.. భగవంతుడి హుండీకే కన్నం వేయాలనుకుంటే ఇది సీన్..

ఓ దొంగ భగవంతుడి హుండీకే కన్నం వేయ్యాలని చూశాడు. కానీ దేవుడు ఊరుకుంటాడా.. దొంగ పని పట్టాడు. దొంగ చేయి హుండీ ఇరుక్కుపోయింది. ఏం చేసినా చేయి బయటకు రాలేదు. దీంతో తెల్లారేవరకు అలాగే ఉండాల్సి వచ్చింది. పొద్దునే ఆలయానికి వచ్చిన భక్తులకు విషయం అర్థమయింది.

Viral:  దేవుడున్నాడు.. భగవంతుడి హుండీకే కన్నం వేయాలనుకుంటే ఇది సీన్..
Thief Thangaraj

Updated on: Apr 28, 2025 | 8:54 AM

దొంగతనం చేసే వారికి ప్లేసుతో సంబంధం లేదు. అది గుడా.. బడా అని కూడా పట్టించుకోరు.  చేతివాటం చూపడమే వారి టార్గెట్. డబ్బులు, బంగారం కనిపిస్తే చాలు.. వారిలోని చోర కళ బయట పడుతోంది. అయితే ఓ దొంగ.. ఏకంగా దేవుడి హుండీనే కొల్లగొట్టాలని చూశాడు. కానీ తన ముందే తప్పు చేస్తుంటే దేవుడా ఊరుకుంటాడా.. ఆ దొంగకు కరెక్ట్‌గా బుద్ది చెప్పాడు. రాత్రి వేళలో దొంగ డబ్బుల కోసం హుండీలో చేయి పెట్టాడు. అయితే దొంగ చేయి హుండీ ఇరుక్కుపోయింది. ఏం చేసినా చేయి బయటకు రాలేదు. దీంతో తెల్లారివరకు అలానే ఉండిపోయాడు. మరుసటి ఉదయం టెంపుల్‌కి వచ్చినవారికి ఈ దొంగ బాగోతం అర్థం అయింది. ముందుగా పారు పోలీసులు,  అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.   ఫైర్ ఫైటర్స్ హుండీని కత్తిరించి దొంగ చేయి బయటకు తీశారు. అనంతరం దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లా నల్లంపల్లి సమీపం చేసంపట్టి గ్రామంలోని పెరియాండిచ్చి ఆలయంలో ఏప్రిల్ 25న వెలుగుచూసింది. నిందితుడు చేసంపట్టి సమీపం సవుళూర్‌ గ్రామానికి చెందిన తంగరాజ్‌(42)గా గుర్తించారు. నిందితుడికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

ఈ వ్యవహారం తెలిసిన నెటిజన్లు నిజంగానే దేవుడున్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. దేవుడి మహిమతోనే దొంగ చేయి హుండీలో ఇరుక్కుపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..