ముంబైలోని బైకుల్లా జైలుకు రియా చక్రవర్తి తరలింపు

సుశాంత్ కేసులో రియాచక్రవర్తిని బుధవారం ఉదయం ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. ఆమె బెయిల్ అభ్యర్థనను మేజిస్ట్రేట్ తిరస్కరించారు. 14 రోజుల జైలు శిక్ష విధించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

ముంబైలోని బైకుల్లా జైలుకు రియా చక్రవర్తి తరలింపు

Edited By:

Updated on: Sep 09, 2020 | 10:39 AM

సుశాంత్ కేసులో రియాచక్రవర్తిని బుధవారం ఉదయం ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. ఆమె బెయిల్ అభ్యర్థనను మేజిస్ట్రేట్ తిరస్కరించారు. 14 రోజుల జైలు శిక్ష విధించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బెయిల్ కోసం రియా ఇవాళ సెషన్స్ కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. గత రాత్రి రియా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయంలోనే గడిపింది. రియాపై ఆరోపణలు రుజువైతే ఆమెకు 10 ఏళ్ళ జైలు శిక్ష పడవచ్ఛునని భావిస్తున్నారు.

 

Follow Us