Rain Alert: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. 17 మంది మృతి.. ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన

Rain Alert: ఈ భారీ వర్షాలతో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ ప్రాంతం అతలాకుతలమైంది. మరోవైపు డార్జిలింగ్‌ బ్రిడ్జి ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డార్జిలింగ్‌ ప్రకృతి విపత్తుపై కేంద్రం సహాయక చర్యలు చేపడుతుందని, బాధితులకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు ప్రధాని..

Rain Alert: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. 17 మంది మృతి.. ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన

Updated on: Oct 05, 2025 | 7:01 PM

Rain Alert: పశ్చిమబెంగాల్‌ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వదరల కారణంగా ఎంతో మంది మృతి చెందారు. భీకర వానలు, వరదలు బెంగాల్‌ను కుదిపేశాయి. ఉత్తర బెంగాల్‌లో ప్రకృతి విలయానికి 17మంది మృతి చెందారు. డార్జిలింగ్‌లో కూలిన కొండచరియలు విరిగిపడ్డాయి. దుధిలాలో బాల్‌సమ్‌ నది మహోగ్రరూపం దాల్చింది. దీంతో వంతెన తీవ్ర స్థాయిలో దెబ్బతింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్ని పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వరదలతో డార్జిలింగ్‌లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమత రేపు పర్యటించనున్నారు.

మరోవైపు డార్జిలింగ్‌ బ్రిడ్జి ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డార్జిలింగ్‌ ప్రకృతి విపత్తుపై కేంద్రం సహాయక చర్యలు చేపడుతుందని, బాధితులకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు ప్రధాని.

ఇది కూడా చదవండి: Top 5 Best Selling: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్‌ 5 బైక్‌లు..రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏ స్థానం?

ఇవి కూడా చదవండి

ఈ భారీ వర్షాలతో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ ప్రాంతం అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో పాటు వరద ముంచెత్తటంతో 17మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతయ్యారు. వరద ఉధృతికి బాలసన్‌ నదిపై సిలిగురి-మిరిక్‌లను కలిపే కీలకమైన ధుదియా వంతెన కూలిపోయింది. కూచ్‌బిహార్‌, జల్పాయ్‌గురి, అలిపురద్వార్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. రబిజోరా దగ్గర వరద ఉధృతితో కాలింపాంగ్‌-డార్జిలింగ్‌ మార్గాన్ని మూసేశారు. కనోరేషన్‌ బ్రిడ్జి మీదుగా సిక్కిం, డార్జిలింగ్‌ కొండప్రాంతాలకు కనెక్టివిటీ కట్ అయింది.

ఇది కూడా చదవండి: Amazon: అమెజాన్‌లో కొత్తగా ‘యాడ్ టు డెలివరీ’ ఫీచర్‌.. దీని ప్రయోజనం ఏంటో తెలుసా?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి