Ram Mandir Pran Pratishtha: రామమందిరప్రాణప్రతిష్ఠలో అద్భుత ఘట్టం..! గుండెపోటుకు గురైన వ్యక్తిని కాపాడిన వాయుసేన..

|

Jan 22, 2024 | 7:41 PM

రామకృష్ణ శ్రీవాస్తవ (65)అనే భక్తుడు ఆలయ ప్రాంగణంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన వింగ్ కమాండర్ మనీష్ గుప్తా నేతృత్వంలోని భీష్మ క్యూబ్ బృందం సంఘటన జరిగిన నిమిషం వ్యవధిలోనే అతన్ని బయటకు తీసి వెంటనే అతనికి చికిత్స అందించింది. ఆ సమయంలో శ్రీవాస్తవ బీపీ.. 210/170 మిమీకి చేరినట్లు గుర్తించారు.. ఈ బృందం అతడికి ప్రాథమిక చికిత్స

Ram Mandir Pran Pratishtha: రామమందిరప్రాణప్రతిష్ఠలో అద్భుత ఘట్టం..! గుండెపోటుకు గురైన వ్యక్తిని కాపాడిన వాయుసేన..
Heart Attack
Follow us on

అయోధ్యలో రామమందిరప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఓ రామభక్తుడు గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటనపై భారత వైమానిక దళం వెంటనే స్పందించింది. ఈ సమయంలో, రామమందిరం కార్యక్రమంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ మొబైల్ ఆసుపత్రి భక్తుడి ప్రాణాలను కాపాడింది. అందిన సమాచారం ప్రకారం…రామకృష్ణ శ్రీవాస్తవ (65)అనే భక్తుడు ఆలయ ప్రాంగణంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన వింగ్ కమాండర్ మనీష్ గుప్తా నేతృత్వంలోని భీష్మ క్యూబ్ బృందం సంఘటన జరిగిన నిమిషం వ్యవధిలోనే అతన్ని బయటకు తీసి వెంటనే అతనికి చికిత్స అందించింది. ఆ సమయంలో శ్రీవాస్తవ బీపీ.. 210/170 మిమీకి చేరినట్లు గుర్తించారు.. ఈ బృందం అతడికి ప్రాథమిక చికిత్స అందించింది..బాధితుడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా మారిన వెంటనే.. మరింత మెరుగైన చికిత్స కోసం అతన్ని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయోధ్యలో శ్రీరామమందిర సందర్శనకు తండోపతండాలుగా తరలివచ్చే భక్తుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశాయి.. ఇక విపత్తుల సమయాల్లో అత్యవసర వైద్యం అందించేందుకు ‘భీష్మ’ పేరిట ఓ చిన్న మొబైల్ ఆసుపత్రిని అందుబాటులో ఉంచినట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మూడు రోజుల క్రితమే ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య మైత్రి విపత్తు నిర్వహణ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు.. ఇందులో రెండు క్యూబ్-భీష్మ మొబైల్ హాస్పిటల్‌లను అయోధ్యలో ఏర్పాటు చేశారు. ఘనాకారంలో ఉండే ‘భీష్మ’లో అత్యాధునిక వైద్య పరికరాలు, కృత్రిమ మేధ, అంతర్జాల సాంకేతికత సాయంతో ఈ ఆసుపత్రి సమర్థవంతమైన సేవలను అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..