Rajnath Singh: భారత్ సైనిక పరాక్రమానికి ఆపరేషన్‌ సిందూర్ నిదర్శనం- రాజ్‌నాథ్ సింగ్

భారత్ ఎన్నటికీ ఉగ్రవాదాన్ని సహించదు.. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయాలని భారత దేశానికి ఉన్న దృఢ సంకల్పానికి భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ నిదర్శనమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ఆయన అన్నారు.

Rajnath Singh: భారత్ సైనిక పరాక్రమానికి ఆపరేషన్‌ సిందూర్ నిదర్శనం- రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh

Updated on: May 11, 2025 | 5:33 PM

లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ కేంద్రాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరును ఆయన అభినందించారు. పాకిస్తాన్ చేసిన దాడులను తిప్పి కొడుతూ పాక్‌లోని కీలక వైమానిక స్థావరాలపై ధ్వంసం చేసి ఉగ్రవాదానికి ధీటైన సమాధానం ఇచ్చామని ఆయన అన్నారు.

భారత్ సైనిక పరాక్రమానికి ఆపరేషన్‌ సిందూర్ నిదర్శనమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని..ఆపరేషన్‌ సింధూర్‌తో పహల్గామ్‌ బాధితులకు న్యాయం జరిగిందని ఆయన అన్నారు. భారత్ ఉగ్రవాదాన్ని సహించదని..దాని నిర్మూలనకు కోసం చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ ఉగ్రవాదానికి దీటైన సమాధానం ఇచ్చిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పాక్‌ ప్రజలపై భారత్ దాడి చేయకపోయిన పాకిస్తాన్ మాత్రం భారత్ ప్రజలపై దాడి చేసిందన్నారు.

అయితే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్‌ ఆక్రమిత కార్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ దాడితో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులను భారత్ మట్టుపెట్టింది. అయితే ఈ ఆపరేషన్ తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. శనివారం అమెరికా ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో భారత్-పాకిస్తాన్‌ కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఈ ఉద్రిక్తతు కాస్తా చల్లబడ్డాయి. అయితే ఈ ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ విరమణను ఉల్లంఘించి కాశ్మీర్‌లొని కొన్ని ప్రాంతాల్లో దాడులకు తెగబడింది. ఈ పాక్‌ దాడులను భారత్‌ సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..