Twins Death: వేర్వేరు రాష్ట్రాల్లో కవలల నివాసం.. గంటల వ్యవధిలో ఒకేలా మరణం.. మిస్టరీ డెత్స్

కవలలు మరణాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వారు ఒకే రీతిలో గంటల వ్యవధిలో మరణించడం హాట్ టాపిక్ అయ్యింది.

Twins Death: వేర్వేరు రాష్ట్రాల్లో కవలల నివాసం.. గంటల వ్యవధిలో ఒకేలా మరణం.. మిస్టరీ డెత్స్
Twins Sumer Singh - Sohan Singh

Updated on: Jan 14, 2023 | 12:02 PM

రెండు వేర్వేరు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న కవల సోదరుల మృతి తీవ్ర సంచలనం రేపుతోంది. ఓ మిస్టరీ సస్పెన్స్ థ్రిలర్ కథను తలపిస్తుంది. 900 కిలోమీటర్ల దూరంలో నివశిస్తున్న కవల సోదరులు గంటల వ్యవధలో ఒకేలా మరణించారు. 26 ఏళ్ల కవలలు సుమేర్, సోహన్ సింగ్‌ల రాజస్థాన్‌లోని బార్మర్‌ ప్రాంతానికి చెందినవారు. సుమేర్ సింగ్ గుజరాత్‌లోని సూరత్‌లో జాబ్ చేస్తున్నాడు. సోహన్ సింగ్ రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సెకండ్ గ్రేడ్ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. బుధవారం రాత్రి సూరత్‌లోని తన ఇంటి పైనుంచి పడి సుమేర్ సింగ్ మృతి చెందాడు. దీంతో సోదరుడి మరణవార్త గురించి సోహన్‌కు ఫోన్ చేసి చెప్పారు కుటుంబ సభ్యులు.

ఈ క్రమంలోనే అతడు సొంతూరుకు పయనమవుతున్నట్లు వారితో చెప్పాడు. అదే రోజు అనూహ్య రీతిలో వాటర్ ట్యాంక్‌లో పడి మృతిచెందాడు సోహన్‌. ఫోన్ మాట్లాడుతుండగా సుమేర్ సింగ్ టెర్రస్ పై నుంచి పడిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సోదరుడు మరణవార్త విని.. ఆ బాధలో  సుమన్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణలో నిజం తేలనుంది. సుమేర్,  సోహన్ సింగ్‌‌ల మృతదేహాలను వారి స్వగ్రామమైన సార్నో కతాలా తీసుకొచ్చి ఒకే చితిపై దహనం చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకుంది. కుటుంబ సభ్యుల శోకాలు మిన్నంటాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.