PM Modi: రాజస్తాన్‌లో పట్టుబడిన 1000 కిలోల పేలుడు పదార్థాలు.. ప్రధాని మోదీ పర్యటనకు ముందు..

ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఇవి దొరకడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ పేలుడు పదార్థాలు వెయ్యి కిలోల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇందులో..

PM Modi: రాజస్తాన్‌లో పట్టుబడిన 1000 కిలోల పేలుడు పదార్థాలు.. ప్రధాని మోదీ పర్యటనకు ముందు..
PM Modi visit

Updated on: Feb 09, 2023 | 9:25 PM

రాజస్తాన్‌ భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. అది కూడా ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఈ పేలుడు పదార్థాలు దొరకడం సంచలనంగా మారింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ పేలుడు పదార్థాలు సుమారు వెయ్యి కిలోల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.  ఇందులో 65 డిటోనేటర్లతో సహా సుమారు 1000 కిలోల పేలుడు పదార్థాలను ఉన్నాయి. బ్లాస్టింగ్ కోసం ఉపయోగించే 360 జెలటిన్ స్టిక్స్‌తో కూడిన 40 బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఒక జిలాటిన్ స్టిక్ బరువు 2.78 కిలోలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు పదార్థాలను తరలిస్తున్న వ్యక్తిను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ పేలుడు పదార్థాలను ఎక్కడి తరలిస్తున్నాడనే వివరాలను సేకరిస్తున్నారు.

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఫిబ్రవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించాల్సి ఉంది. ఈ దృష్ట్యా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వాహనంను చెక్ చేయడంతో ఈ పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. వెంటనే  పేలుడు పదార్థాలను తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాని పర్యటనకు ముందు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన దౌసా పోలీసులు.. జిల్లాలోని ఖాన్ భంకారీ రోడ్డు సమీపంలో పేలుడు పదార్థాలను తరలిస్తున్న నిందితులను గుర్తించారు. అరెస్టయిన వ్యక్తిని వ్యాస్ మొహల్లా నివాసి రాజేష్ మీనాగా గుర్తించారు. పేలుడు పదార్థాలను తరలిస్తున్న వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు ఆ వాహనాన్ని అడ్డుకున్నామని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం