
చత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం జరగింది. జష్‌పూర్-నారాయణ్‌పూర్ ప్రాంతంలో కొండను ఢీకొట్టిన ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్ దుర్మరణం పాలైనట్టు తెలుస్తోంది. ప్రయాణికుల గురించి వివరాలు తెలియడం లేదు. ప్రమాదం తరువాత ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి పోలీసులతో పాటు ఇతర ఉన్నతాధికారులు చేరుకున్నారు. విమానంలో పైలట్లతో సహా ఉన్న ప్రయాణికుల వివరాల గురించి ఆరా తీస్తున్నారు.
జష్‌పూర్-నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ముందు చెట్టును ఢీకొట్టిన తరువాత విమానం కొండ మీద కూలినట్టు చెబుతున్నారు. తక్కువ ఎత్తులో 30 అడుగుల ఎత్తులో విమానం ఎగురుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన అటవీప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
ఆ విమానంలో ఎంతమంది ఉన్నారు.. ఎవరెవరు చనిపోయారు.. ప్రమాదం ఎలా జరిగింది..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.