PM Narendra Modi: పుల్వామా ఘాతుకానికి మూడేళ్లు.. అమరవీరులకు నివాళి అర్పించిన ప్రధాని మోడీ..

Pulwama Attack: స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకొనే ప్రేమికుల దినోత్సవం రోజున ఉగ్రదాడికి పాల్పడ్డారు పాక్‌ ముష్కరులు.

PM Narendra Modi: పుల్వామా ఘాతుకానికి మూడేళ్లు.. అమరవీరులకు నివాళి అర్పించిన ప్రధాని మోడీ..

Updated on: Feb 14, 2022 | 12:07 PM

Pulwama Attack: స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకొనే ప్రేమికుల దినోత్సవం రోజున ఉగ్రదాడికి పాల్పడ్డారు పాక్‌ ముష్కరులు. సరిగ్గా మూడేళ్ల క్రితం (2019 ఫిబ్రవరి 14న) భారత సైనికులను లక్ష్యంగా చేసుకుని కశ్మీర్‌లోని పుల్వామా (Pulwama )వద్ద పాక్‌కు చెందిన జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి మరి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కాగా ఈ నెత్తుటి మరకకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశమంతా అశ్రునివాళులు అర్పిస్తోంది.

కాగా ఈ ఘాతుకానికి పాల్పడిన పాక్‌ ఉగ్రమూకలకు భారత సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌ రూపంలో గుణపాఠం చెప్పింది. అయితే మూడేళ్లు గడిచిన కూడా ఆ భయంకర సంఘటన అందరినీ కదిలించింది వేస్తోంది. ఈక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడేళ్ల క్రితం నాటి చేదు ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘2019లో పుల్వామా దాడిలో అమరులైనవారందరికీ నా నివాళి. దేశానికి వారు అందించిన విశిష్ఠ సేవలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. జవాన్ల ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలుస్తాయి’ అంటూ జవాన్లకు నివాళి అర్పించారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us