PM Modi: చాట్‌ జీపీటీ ఉపయోగం మంచిదే కానీ.. బిల్‌గేట్స్‌తో మోదీ కామెంట్స్‌

|

Mar 29, 2024 | 9:51 AM

భారత్‌లో టెక్నాలజీ వినియోగం తీరుతెన్నులను ప్రధాని బిల్‌గేట్స్‌కు వివరించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిమించడానికి టెక్నాలజీని వాడాలని నేను భావించానన్న మొదీ, అలాగే మైండ్‌సెట్‌ను కూడా మార్చాలని భావించినట్లు చెప్పుకొచ్చారు. G-20 సదస్సులో AI టెక్నాలజీని వాడుకున్నామని చెప్పిన ప్రధాని నమో యాప్‌ను...

PM Modi: చాట్‌ జీపీటీ ఉపయోగం మంచిదే కానీ.. బిల్‌గేట్స్‌తో మోదీ కామెంట్స్‌
Pm Modi
Follow us on

భారత ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ల ఆసక్తికర చర్చ జరిగింది. ఈ నెల మొదటి వారంలో భారత పర్యటనకు వచ్చిన బిల్‌గేట్స్‌ ప్రధానితో సమావేశమై పలు విషయాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య టెక్నాలజీ మొదలు వ్యవసాయం వరకు అన్ని అంశాలపై చర్చించారు.

భారత్‌లో టెక్నాలజీ వినియోగం తీరుతెన్నులను ప్రధాని బిల్‌గేట్స్‌కు వివరించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిమించడానికి టెక్నాలజీని వాడాలని నేను భావించానన్న మొదీ, అలాగే మైండ్‌సెట్‌ను కూడా మార్చాలని భావించినట్లు చెప్పుకొచ్చారు. G-20 సదస్సులో AI టెక్నాలజీని వాడుకున్నామని చెప్పిన ప్రధాని నమో యాప్‌ను ఎలా ఉపయోగించుకోవావే గేట్స్‌కు వివరించారు. చాట్‌ జీపీటీ వినియోగం మంచిదేనని తెలిపిన మోదీ,కానీ ఇది అలసత్వానికి దారి తీయకూడదని సూచించారు.

డిజిటల్‌ రంగంలో భారత్‌ తీసుకొచ్చిన మార్పులను ప్రధాని మోదీ సమక్షంలో బిల్‌గేట్స్‌ ప్రశంసించారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ ప్రారంభమై 25 ఏళ్లు గడిచిందని బిల్‌గేట్ తెలిపారు. ఇక డేటా వినియోగం గురించి మోదీ మాట్లాడుతూ.. ప్రైవసీని దెబ్బతీయకుండా డేటా వినియోగం జరగాలన్నారు. రీసెర్చ్‌ డేటా వాడుకునే సమయంలో.. డేటా యజమానికి ఈ విషయం తెలియాలని అన్నారు.

ఇక వీరిద్దరి మధ్య పర్యావరణ పరిరక్షణపై కూడా చర్చ జరిగింది. సన్‌రైజ్‌ సెక్టార్ల కోసం రూ.లక్ష కోట్ల కార్పస్‌ ఫండ్‌ను విడుదల చేసినట్లు తెలిపిన ప్రధాని.. జీవనశైలిలో మార్పుల కోసం మిషన్‌ లైఫ్‌ తీసుకొచ్చినట్లు తెలిపారు. విద్యుత్‌, ఉక్కు వినియోగం పర్యావరణ విరుద్ధం అన్ని మోదీ గ్రీన్‌ జీడీపీ వృద్ధి చేసుకోవడంలో దృష్టిపెడతామన్నారు. సిరిధాన్యాల వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం మిల్లెట్స్‌ ఉత్పత్తిపై పెద్ద కంపెనీలు దృష్టిపెట్టాయన్నారు. ఇక సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ గురించి కూడా బిల్‌గేట్స్‌కు మోదీ వివరిచారు.

ఈ విగ్రహ నిర్మాణం కోసం ఆరులక్షల గ్రామాల నుంచి ఉక్కు, మట్టిని తెప్పించామన్నారు. ఏకత్వాన్ని చాటిచెప్పేలా ఈ విగ్రహ నిర్మాణం చేపట్టామన్నారు. భావితరాలకు ఈ నిర్మాణంలో ఇంజినీరింగ్‌ను నేర్పిస్తామన్నారు. ఇక తనకు టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టమన్న మోదీ.. తాను ఎక్కడ ఏ వస్తువును చూసినా, ఏ టెక్నాలజీని చూసినా.. దాని వినియోగం గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..