AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మహిళలను క్షమాపణ కోరుతున్నా- ప్రధాని మోదీ

PM Modi Addresses Nation Live Updates: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి 8:30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ హఠాత్తు పరిణామంతో దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి మరియు ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రసంగానికి సంబంధించి మీడియా వర్గాల్లో ప్రచారంలో ఉన్న అంశాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..

PM Modi: మహిళలను క్షమాపణ కోరుతున్నా- ప్రధాని మోదీ
Pm Modi Speech
Subhash Goud
|

Updated on: Apr 18, 2026 | 9:12 PM

Share

LIVE NEWS & UPDATES

  • 18 Apr 2026 09:12 PM (IST)

    చెన్నై టార్గెట్ 195

    హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి  194 పరుగులు చేసింది.

  • 18 Apr 2026 09:09 PM (IST)

    భయం పట్టుకుంది

    కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ, టీఎంసీ, డీఎంకేలు పదే పదే అదే పనిచేస్తూ వచ్చాయని, సాంకేతిక అంశాలను సాకుగా చూపుతూ.. మహిళల అధికారం లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. మహిళలకు అధికారం ఇస్తే ఉనికి దెబ్బతింటుందన్నారు. కుటుంబ వారసత్వ పార్టీలకు భయంపట్టుకుందని, గ్రామ పంచాయతీల్లో మహిళలు సత్తా చాటారని గుర్తి గుర్తు చేశారు.

  • 18 Apr 2026 09:06 PM (IST)

    దేశానికి కాంగ్రెస్‌ తీరని నష్టం చేసింది

    దేశానికి కాంగ్రెస్‌ పార్టీ తీరని నష్టమని మోదీ అన్నారు. ఇది ఒక బిల్లుకు సంబంధించిన అంశం కాదు.. కాంగ్రెస్‌ విధానం, వ్యవహారశైలికి సంబంధించింది అని అన్నారు.

  • 18 Apr 2026 09:04 PM (IST)

    దేశం కోసం చేసే మంచి పనులను అడ్డుకున్నారు

    దేశం కోసం చేసే మంచి పనులను అడ్డుకున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. సంస్కరణలను కాంగ్రెస్‌ అడ్డుకుంటూ రావడంతోనే.. అనేక దేశాలు భారత్‌ కంటే ముందుకు దూసుకెళ్లాయన్నారు. అడ్డుపుల్లలు వేయడమే కాంగ్రెస్‌ సిద్ధాంతం అని ఆరోపించారు. పొరుగుదేశాలతో ఉన్న వివాదాలను పరిష్కరించకుండా.. కాంగ్రెస్‌ కొనసాగిస్తూ వచ్చిందన్నారు.

  • 18 Apr 2026 09:02 PM (IST)

    ట్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారు

    ట్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారని, అక్రమ వలసదారులను వెనక్కి పంపే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. నక్సలిజాన్ని అంతంచేసే ప్రయత్నాలను అడ్డుకున్నారని, దేశం కోసం చేసే మంచి పనులను అడ్డుకున్నారని మోదీ మండిపడ్డారు.

  • 18 Apr 2026 09:01 PM (IST)

    కాంగ్రెస్‌ పాపాలు కడిగేసుకుంటుందని అనుకున్నా

    కాంగ్రెస్‌ పాపాలు కడిగేసుకుంటుందని అనుకున్నా.. కానీ అలా జరగలేదని మోదీ విమర్శలు గుప్పించారు. దేశంలో కాంగ్రెస్‌ ఉనికి కోల్పోతూ వచ్చిందని, ఉనికి కోసం ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపిందన్నారు.

  • 18 Apr 2026 08:59 PM (IST)

    భ్రూణ హత్యకు పాల్పడ్డాయి

    కాంగ్రెస్‌న, మిత్రపక్షాలు భ్రూణ హత్యకు పాల్పడ్డాయని మోదీ అన్నారు. మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. మహిళా రిజర్వేషన్లపై ద్వేషం ప్రదర్శిస్తూనే ఉన్నారని మండిపడ్డారు.

  • 18 Apr 2026 08:57 PM (IST)

    కాంగ్రెస్‌ పరాన్నజీవిగా మారింది

    కాంగ్రెస్‌ పరాన్నజీవిగా మారిందని మోదీ అన్నారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి కుట్ర చేసిందని మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్‌ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందన్నారు. ప్రాంతీయ పార్టీల భవిష్యత్‌ను కాంగ్రెస్‌ పణంగా పెట్టిందన్నారు.

  • 18 Apr 2026 08:55 PM (IST)

    కాంగ్రెస్‌ ప్రతిసారి అడ్డుకుంటుంది

    కాంగ్రెస్‌ మిత్రపక్షాలు భ్రూణ హత్యలకు పాల్పడ్డాయని, కాంగ్రెస్‌, ఎస్పీ, డీఎంకే, టీఎంసీ పార్టీలకు భ్రూణహత్యలో భాగం ఉందన్నారు. ప్రతిసారి మహిళా రిజర్వేషన్‌ను కాంగ్రెస్‌ అడ్డుకుందని మోదీ గుర్తు చేశారు.

  • 18 Apr 2026 08:50 PM (IST)

    40 ఏళ్లుగా..

    40 ఏళ్లుగా ఆఇపోయిన మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేశామన్నారు. కానీ విపక్షాలు అడ్డుతగిలాయని అన్నారు. దేశంలోని సగం జనాభాకు అధికారం కల్పించకుండా పవిత్ర ప్రయత్నాన్ని దెబ్బకొట్టారన్నారు.

  • 18 Apr 2026 08:48 PM (IST)

    మహిళల స్వప్నాన్ని చిదిమేశారు

    మహిళల స్వప్నాన్ని చిదిమేశారని మోదీ అన్నారు. నారీ శక్తి ఎవరి హక్కులనూ లాక్కునేది కాదన్నారు. అందుకు మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. మహిళలకు సమాన హక్కులను కల్పించేందుకు ప్రయత్నించామన్నారు.

  • 18 Apr 2026 08:46 PM (IST)

    మాకు జాతీయ ప్రయోజనాలే సర్వోన్నతమైనవి: ప్రధాని

    మాకు జాతీయ ప్రయోజనాలే సర్వోన్నతమైనవి. అయితే, కొందరికి పార్టీ ప్రయోజనాలే సర్వస్వం అయినప్పుడు, జాతీయ ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలే గొప్పవైనప్పుడు, దాని పర్యవసానాలను మహిళలు, దేశం భరించాల్సి వస్తుంది.

  • 18 Apr 2026 08:43 PM (IST)

    వారిని మహిళలు శిక్షిస్తారు

    దేశంలోని మహిళలను విపక్షాలు అవమానించాయని మోదీ అన్నారు. విపక్షాల కుట్రను మహిళలు అర్థం చేసుకున్నారన్నారు. తప్పకుండా మహిళలు వాళ్లను శిక్షిస్తారన్నారు.

  • 18 Apr 2026 08:42 PM (IST)

    బిల్లు వీగిపోవడం నేను ఎంతో ఆవేదన చెందా

    బిల్లు వీగిపోవడం నేను ఎంతో ఆవేదన చెందానని మోదీ అన్నారు. మీకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. విపక్షాలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

  • 18 Apr 2026 08:40 PM (IST)

    మహిళల హక్కులను విపక్షాలు తుంగలో తొక్కాయి

    మహిళల హక్కులను విపక్షాలు తుంగలో తొక్కాయని మోదీ అన్నారు. విపక్షాలు క్షమించరాని నేరం చేశామని మండిపడ్డారు. కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ వంటి కటుంబ వారసత్వ పార్టీలు చప్పట్లు కొట్టాయన్నారు.

  • 18 Apr 2026 08:36 PM (IST)

    నారీ శక్తిని ఎదగకుండా అడ్డుకున్నారు

    మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాయని, బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయని అన్నారు. నారీ శక్తిని ఎదగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

  • 18 Apr 2026 08:34 PM (IST)

    విపక్షాలు తప్పు చేశాయి

    బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయని అన్నారు. మహిళలను క్షమాపణలు కోరుతున్నామని అన్నారు.

  • 18 Apr 2026 08:33 PM (IST)

    కట్టుబడి ఉన్నాం

    మహిళా రిజర్వేషన్ల విషయంలో కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగంలో కీలక విషయాలు వెల్లడిస్తున్నారు.

  • 18 Apr 2026 07:46 PM (IST)

    మోదీ ప్రసంగంపై ఉత్కంఠ

    మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రి 8.30 గంటలకు మోదీ ఎలాంటి ప్రసంగం చేస్తారోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

PM Modi Addresses Nation Live Updates: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి 8:30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ హఠాత్తు పరిణామంతో దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారంటే ఏదో ఒక కీలక నిర్ణయం లేదా ప్రకటన ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి.

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తరువాత మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే.. విపక్షాల తీరును కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ తప్పు పట్టారు. విపక్షాల తీరుపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడే అవకాశం ఉంది. అంతేకాకుండా.. పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన పరిణామాలు.. అదేవిధంగా బిల్లులకు మద్దతు ఇవ్వకపోవడం సహా.. పలు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుధీర్ఘంగా ప్రసంగించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published On - Apr 18,2026 7:43 PM

Follow Us