PM Modi: భారత్ లక్ష్యం అదే.. ‘ఇండియా ఎనర్జీ వీక్ 2023’ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

PM Modi - Karnataka: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ కర్ణాటకలో పర్యటించనున్నారు. బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ (IEW - 2023) ను ప్రధాని మోడీ ప్రారంభించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత తుమకూరులోని హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్‌ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు.

PM Modi: భారత్ లక్ష్యం అదే.. 'ఇండియా ఎనర్జీ వీక్ 2023'ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
Pm Modi
Follow us

|

Updated on: Feb 06, 2023 | 7:35 AM

PM Modi – Karnataka: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ కర్ణాటకలో పర్యటించనున్నారు. బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ (IEW – 2023) ను ప్రధాని మోడీ ప్రారంభించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత కర్ణాటక తుమకూరులోని హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్‌ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. దీంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం వరకు కర్ణాటకలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది. ఇథనాల్ బ్లెండింగ్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా 20 శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలిపిన E20 ఇంధనాన్ని కూడా ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. హరిత ఇంధనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రీన్ మొబిలిటీ ర్యాలీని ప్రారంభిస్తారు.

మూడు రోజుల ఇండియా ఎనర్జీ వీక్‌ సదస్సు జరగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఆదివారం నుంచి బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఎనర్జీ వీక్ సదస్సులో రాష్ట్ర, కేంద్ర మంత్రులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రపంచవ్యాప్తంగా 30వేల ప్రతినిధులు పాల్గొననున్నారు. దీంతోపాటు 1,000 మంది ప్రదర్శనకారులు, 500 మంది వక్తలు భారతదేశ ఇంధన భవిష్యత్తు.. సవాళ్లు, అవకాశాల గురించి చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో, ప్రధాని మోదీ గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ సీఈఓలతో రౌండ్ టేబుల్ ఇంటరాక్షన్‌లో సైతం పాల్గొంటారు. ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో పలు కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. తుమకూరులోని టిప్టూరు, చిక్కనాయకనహళ్లిలో రెండు జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

దేశంలోని అన్ని హెలికాప్టర్ల అవసరాలను తీర్చే వన్ స్టాప్ సొల్యూషన్‌ లక్ష్యంగా ప్రధాని మోడీ.. 2016లో కర్నాటకలోని తుముకూరులో 615 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్‌ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఈ హెచ్ఏఎల్ ఫ్యాక్టరీని ప్రధాని మోడీ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభించి.. జాతికి అంకితం చేయనున్నారు. భారత్‌లోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ సౌకర్యాలు కలిగిన ఈ ఫ్యాక్టరీలో మొదట లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు తయారు చేయనున్నారు. ఈ హెల్‌యూహెచ్‌లు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసింది. ఇందులో 3-టన్ క్లాస్, సింగిల్ ఇంజన్ మల్టీపర్సర్ యుటిలిటీ హెలికాప్టర్‌గా అభివృద్ధి చేయనున్నారు. ప్రతి సంవత్సరం 30 హెలికాప్టర్ల వరకూ తయారు చేసి.. దశలవారిగా ఏడాదికి 60 నుంచి 90 వరకూ తయారు చేస్తారు.

ఇవి కూడా చదవండి

కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బీజేపీ ఆ రాష్ట్రంపై ఫోకస్ చేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర ఎన్నికల రథసారధులను సైతం ప్రకటించింది. రాష్ట్రంలో మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రధాని మోడీ వరుస పర్యటనలు చేస్తున్నారు. నెల వ్యవధిలోనే ప్రధాని మోడీ పర్యటన ఇది మూడోది.. ప్రధానమంత్రి జనవరి 12న హుబ్బళ్లిలో జాతీయ యువజనోత్సవాన్ని ప్రారంభించి, భారీ రోడ్‌షోను నిర్వహించారు. జనవరి 19న యాదగిరి, కలబురగి జిల్లాల్లో అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను సైతం ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..