వారసత్వ పార్టీలు తనకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని అన్నారు. ఉత్తర్ప్రదేశ్, కన్పూర్లోని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పూర్వీకుల గ్రామం పారౌంఖ్ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు ప్రధాని మోదీ. వారసత్వ రాజకీయాలు దేశంలో నైపుణ్యాన్ని అణచివేస్తున్నాయని ఆరోపించారు. వారసత్వ రాజకీయాల్లోని వారు తనకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారని.. వారి కుటిల నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. దేశంలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి. అప్పుడే మారుమూల గ్రామంలో జన్మించిన వ్యక్తి సైతం ప్రధానమంత్రి, రాష్ట్రపతి అయ్యేందుకు వీలుంటుంది. వారసత్వ పార్టీలు తనకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నాయన్నారు. ఎవరితో నాకు వ్యక్తిగతంగా విబేధాలు లేవన్నారు. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటానాని అన్నారు. బంధుప్రీతిలో చిక్కుకున్న ఈ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేసేందుకు ముందుకు రావాలి. ఈ రోజు రాష్ట్రపతి రిసీవ్ చేసుకునేందుకు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాను. మేము ఆయన కింద పని చేస్తున్నాము. ఆ పదవికి పవిత్రత ఉంది. కానీ, తాను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని.. విలువలు ముఖ్యమని కోవింద్ నాతో చెప్పారు. ఒక రాష్ట్రపతిగా కాకుండా గ్రామస్తుడిగా స్వాగతించేందుకు వచ్చినట్లు చెప్పారు.
Today I was embarrassed when President came to receive me…We’re working under him, there’s a sanctity to his post but he told me that he respects Constitution but values matter & added that he had come to welcome me as a villager not as a President: PM Modi in Kanpur Dehat, UP pic.twitter.com/f6exDOhc2i
ఇవి కూడా చదవండి— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 3, 2022
ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు రాష్ట్రపతి కోవింద్. జపాన్ పర్యటన సందర్భంగా అక్కడి భారతీయులతో ప్రధాని మోదీ మాట్లాడిన అంశాలను గుర్తు చేసుకున్నారు. ప్రపంచానికి భారత్ శక్తిని కొత్త విధానంలో తెలియజేశారని పేర్కొన్నారు. మోదీ ఒక దృఢమైన నాయకుడని ప్రశంసించారు రాష్ట్రపతి కోవింద్.
జాతీయ వార్తల కోసం..