PM Modi: చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ అంగీకారం అందుకే.. మోదీ కీలక వ్యాఖ్యలు..

'ప్రధానమంత్రి అండ్‌ 5-ఎడిటర్స్‌' ప్రోగ్రామ్‌లో ఎన్డీఏ కూటమికి వచ్చే సీట్లపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రధాని మోదీ. ఈసారి 400 ఎంపీ స్థానాలు గెలవడం కాదు.. ఆల్రెడీ 400 సీట్లు తమ దగ్గరే ఉన్నాయంటూ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పుకొచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్డీఏ దగ్గర 360 సీట్లు ఉన్నాయన్నారు ప్రధాని. ఎన్డీఏలో లేకున్నా బీజేడీతో పాటు మిగతా వారిని కూడా కలుపుకొంటే తమ దగ్గర 400 సీట్లు ఉన్నట్టేనని టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ అడిగి ప్రశ్నకు సమాధానమిచ్చారు.

PM Modi: చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ అంగీకారం అందుకే.. మోదీ కీలక వ్యాఖ్యలు..
Pm Modi
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 03, 2024 | 7:28 AM

‘ప్రధానమంత్రి అండ్‌ 5-ఎడిటర్స్‌’ ప్రోగ్రామ్‌లో ఎన్డీఏ కూటమికి వచ్చే సీట్లపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రధాని మోదీ. ఈసారి 400 ఎంపీ స్థానాలు గెలవడం కాదు.. ఆల్రెడీ 400 సీట్లు తమ దగ్గరే ఉన్నాయంటూ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పుకొచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్డీఏ దగ్గర 360 సీట్లు ఉన్నాయన్నారు ప్రధాని. ఎన్డీఏలో లేకున్నా బీజేడీతో పాటు మిగతా వారిని కూడా కలుపుకొంటే తమ దగ్గర 400 సీట్లు ఉన్నట్టేనని టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమిపై అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు ప్రధాని. 2019లో ఎన్‌డీఏలోంచి చంద్రబాబు వెళ్లిపోయారు, ఇప్పుడు హఠాత్తుగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, ఎటువంటి ఫలితాల్ని ఆశిస్తున్నారు? అనే ప్రశ్నకు.. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించడం తమ సిద్ధాంతమన్నారు మోదీ. బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నా సరే ఏపీలో టీడీపీని చేర్చుకున్నాం, మహారాష్ట్రలో శివసేనను చేర్చుకున్నామన్నారు. భారత్‌ అనేక వైవిధ్యాలున్న దేశం. అందుకే, ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు సంపూర్ణ గౌరవం దక్కాలన్నది తమ సిద్ధాంతమన్నారు. అందుకే, ప్రాంతీయ పార్టీలను స్వాగతించాలి, వాటికి సహకారం అందాల్సిందేనన్నారు. జాతీయ పార్టీ ఎంత పెద్దదైనా కావచ్చు, అది ప్రాంతీయ ఆకాంక్షలను సమానంగా గౌరవించాలన్నదే బీజేపీ సిద్ధాంతమన్నది మోదీ మాట. జాతీయ రాజకీయాలు సైతం అలానే ఉండాలన్నారు. అందుకే తమతో ఎవరు ఉన్నా లేకపోయినా తాము మాత్రం ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు విలువ ఇస్తామని టీవీ9తో జరిగి ఇంటర్వూలో చెప్పారు ప్రధాని మోదీ.

ఇక్కడే ప్రధాని మోదీని మరో ఇంపార్టెంట్ క్వశ్చన్‌ అడిగారు. ఏపీలో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమితో లాభం ఉంటుందా? ఉంటే ఎటువంటి లాభం ఉంటుంది అని అడిగినప్పుడు.. లాభనష్టాల్ని లెక్కలేసుకుని రాజకీయాలు చేయడం, పొత్తులు కుదుర్చుకోవడం బీజేపీ సిద్ధాంతం కాదన్నారు మోదీ. ఈమధ్యే ఏపీలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో కలిసి ర్యాలీలో పాల్గొన్నానని, చాలా ఏళ్ల తర్వాత ఆంధ్రాలో అంత పెద్ద ర్యాలీ జరిగిందని గుర్తుచేసుకున్నారు ప్రధాని. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్రంలో ఒక బలమైన ప్రభుత్వం ఉండాలనే కోరిక ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో స్పష్టంగా ఉందని తనకు అర్థమైందన్న ప్రధాని..మార్పు కోరుకుంటున్న విషయాన్ని తాను గమనించానన్నారు. అంతే కాదు ఏపీలో ఓటర్లు రెండుగా విడిపోయారని..రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కొనసాగించాలా లేదా? ఢిల్లీలో ప్రభుత్వం మరింత బలంగా ఉండాలంటే ఏం చేయాలి..అన్నది ఏపీలో కనిపించిందన్నారు మోదీ. మొత్తానికి, పొత్తులను ఒక ప్రత్యేక కారణంతోనే కుదుర్చున్నారని మోదీ మాటల్లో తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఉప్పు ఎక్కువ తింటున్నారా? మీ వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది..
ఉప్పు ఎక్కువ తింటున్నారా? మీ వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది..
డైటింగ్‌ సమయంలో ఆకలి కంట్రోల్‌ చేయలేకపోతున్నారా?
డైటింగ్‌ సమయంలో ఆకలి కంట్రోల్‌ చేయలేకపోతున్నారా?
చెర్రీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. గేమ్ చేంజర్ అప్ డేట్ వచ్చేసింది..
చెర్రీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. గేమ్ చేంజర్ అప్ డేట్ వచ్చేసింది..
చల్లగా బీరు తాగుదామని వైన్స్‌కి వెళ్లాడు.. ఆ తర్వాత జరిగిన సీన్.!
చల్లగా బీరు తాగుదామని వైన్స్‌కి వెళ్లాడు.. ఆ తర్వాత జరిగిన సీన్.!
క్వాలిఫైయర్ 1లో కోల్‌కతాతో ఢీ కొట్టనున్న హైదరాబాద్..
క్వాలిఫైయర్ 1లో కోల్‌కతాతో ఢీ కొట్టనున్న హైదరాబాద్..
కేవలం రూ.20తో యూరిక్‌ యాసిడ్‌ సమస్య నుంచి బయటపడొచ్చు.. ఎలాగంటే!
కేవలం రూ.20తో యూరిక్‌ యాసిడ్‌ సమస్య నుంచి బయటపడొచ్చు.. ఎలాగంటే!
రష్మిక ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన మోదీ..
రష్మిక ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన మోదీ..
నోబాల్ ఇచ్చాడని అంపైర్‌తో గొడవ.. చరిత్రలోనే చెత్త రికార్డ్
నోబాల్ ఇచ్చాడని అంపైర్‌తో గొడవ.. చరిత్రలోనే చెత్త రికార్డ్
ఉప్పు తగ్గిస్తే మంచిదే.. కానీ అసలే తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా.?
ఉప్పు తగ్గిస్తే మంచిదే.. కానీ అసలే తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా.?
ఖబడ్దార్.! చంటిపిల్ల జోలికొస్తే తొక్కిపడేస్తాం..
ఖబడ్దార్.! చంటిపిల్ల జోలికొస్తే తొక్కిపడేస్తాం..