'పాప ముక్తి' కొలను.. ఈ నీళ్లలో మునిగితే పాపాలన్నీ పోతాయ్‌!

May 17, 2024

TV9 Telugu

TV9 Telugu

ప్రతి మనిషి తన జీవితంలో తెలిసో.. తెలియకో కొన్ని అనార్ధాలు చేస్తాడు. వాటిని పాపాల కింద జమకట్టి నిత్యం వాటిని తలకుంటూ కుంగి కుశించిపోతుంటాడు. కొందరికి అలాంటివి ఉండవనుకోండి అది వేరేవిషయం

TV9 Telugu

ఏదిఏమైనా చేసిన పాపాలు కడిగేసుకోవడానికి కొందరు గుళ్లకు వెళ్లి దేవుడికి కానుకలు సమర్పించి 'మమ' అనిపించేస్తుంటారు. మరికొందరు పేదలకు, మూగ జీవాలకు తోచిన సాయం చేసి తృప్తి పడుతుంటారు

TV9 Telugu

అయితే ఇలాంటి పనులు చేయడం వల్ల నిజంగా మనం చేసిన పాపం తుడిచిపెట్టుకుపోతుందా? అందుకు రుజువేంటీ? అనే డౌటు మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది

TV9 Telugu

అందుకు సరైన సమాధానం ఎవ్వరి వద్ద ఉండదు. కొన్నైనా మంచి పనులు చేస్తే చేసిన పాపం తాలూకు తీవ్రత కాస్త తగ్గొచ్చేమో కానీ పగిలిన అద్దాన్ని ఏవిధంగా అయితే అతికించలేమో.. మనం చేసిన తప్పువల్ల ఎదుటి వారికి తగిన గాయం మాన్పలేం

TV9 Telugu

అయితే రాజస్థాన్‌లోని 'పాప ముక్తి' ఆలయంలో మాత్రం చేసిన పాపాలు పోగొట్టడమే కాకుండా.. చేసిన పాపం పోయినట్టుగా సర్టిఫికెట్‌ సైతం ఇస్తుందట. మనం ఇప్పుడు ఆ ఆలయం గురించే చెప్పుకోబోతున్నాం..

TV9 Telugu

ఎంతటి ఘోర నేరం చేసినా.. లక్షల్లో ఖర్చులు, భారీ దానాలు లేకుండానే ఈ ఆలయంలో కేవలం రూ.12 ఖర్చుతో పాపాన్ని సమూలంగా కడిగేసుకోసుకోవచ్చట. పాపం పోయినట్టుగా అక్కడి పూజారులు సర్టిఫికెట్‌ చేతిలో పెట్టేస్తారు

TV9 Telugu

రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఉన్న ఈ పురాతన ఆలయం కొన్ని శతాబ్దాలుగా తీర్థ యాత్రలకు ప్రసిద్ధిగాంచింది. ఆ ఆలయాన్ని గిరిజనుల హరిద్వార్‌ అని కూడా పిలుస్తారు. ఆ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా భక్తులకు చేసిన పాపం పోయినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే ఆచారం ఉంది

TV9 Telugu

ఈ ఆలయాన్ని గౌతమేశ్వర్ మహాదేవ్ పాపమోచన తీర్థంగా కూడా పిలుస్తారు. అక్కడ ఉండే ‘మందాకిని పాప విమోచిని గంగా కుంద్‌’ జలాశయం నీటితో రూ.12 చెల్లించి స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయనేది విశ్వాసం