ఈ ఏడాది బడ్జెట్ సకాలంలో అమలయ్యేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) అన్నారు. ఆయన వెబ్‌నార్ ద్వారా అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. వెబ్‌నార్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ 2022 గురించి వివరించిన ప్రధాని మోడీ, ప్రభుత్వం నమ్మకంగా పురోగతిని సాధించిందని, “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(artificial intelligence) సెమీకండక్టర్స్(semiconductors), స్పేస్ టెక్నాలజీ జెనోమిక్స్, ఫార్మాస్యూటికల్స్, క్లీన్ టెక్నాలజీస్ టు 5G” వంటి రంగాలలో సానుకూలంగా పెట్టుబడిదారులు పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. 5వ తరం ఇంటర్నెట్ సేవలపై కూడా మాట్లాడారు. భారతీయులకు కొత్త సాంకేతికతను అందించే పనిలో ప్రభుత్వం ఉందని, దాని కోసం ప్రభుత్వం 5G స్పెక్ట్రమ్ వేలం కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించిందని గుర్తు చేశారు.
స్టార్టప్ రంగంలో ప్రభుత్వాలు చేస్తున్న కృషిని అభినందిస్తూ, భారతదేశాన్ని ప్రపంచంలోని ప్రముఖ, మూడో అతిపెద్ద వ్యవస్థగా మార్చినందుకు, ఈ రంగానికి ప్రభుత్వం నుండి మరింత సహాయం అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. “నైపుణ్యం కోసం ఒక పోర్టల్ కూడా ప్రతిపాదించనట్లు తెలిపారు. 2022-2023 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు. 2022-2023 బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం తర్వాత రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభను ఒక నెల పాటు వాయిదా వేశారు. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 13 వరకు సభ వాయిదా పడి మార్చి 14 నుంచి పార్లమెంట్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
Read Also.. స్వదేశానికి విద్యార్థులు.. 4 భాషల్లో స్వాగతం పలికిన కేంద్ర మంత్రి.. వీడియో వైరల్