‘టీ డిప్లొమసీ మాకెందుకు’? సస్పెండయిన ఎంపీల ఆగ్రహం

వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్ రభస నేపథ్యంలో సస్పెన్షన్ కి గురైన 8 మంది ఎంపీలు రాత్రంతా పార్లమెంట్ బయట గాంధీ విగ్రహం వద్ద ధర్నా కొనసాగించారు. మంగళవారం ఉదయం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ వారిని...

టీ డిప్లొమసీ మాకెందుకు? సస్పెండయిన ఎంపీల ఆగ్రహం

Edited By:

Updated on: Sep 22, 2020 | 10:24 AM

వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్ రభస నేపథ్యంలో సస్పెన్షన్ కి గురైన 8 మంది ఎంపీలు రాత్రంతా పార్లమెంట్ బయట గాంధీ విగ్రహం వద్ద ధర్నా కొనసాగించారు. మంగళవారం ఉదయం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ వారిని కలుసుకుని టీ, బిస్కెట్లు ఇవ్వబోగా, వారు నిరాకరించారు. ‘టీ డిప్లొమసీ’ తమకెందుకని, రైతులకోసం తాము పోరాడుతున్నామని పేర్కొన్నారు. పార్లమెంటును ఖూనీ చేశారని ఆరోపించిన వారు..హరివంశ్ ని ‘రైతు వ్యతిరేకి’ అని అన్నారు. కాగా ప్రధాని మోదీ..హరివంశ్ ని సమర్థిస్తూ.. విశాల హృదయంతో ఆయన ఎంపీలకు టీ ఇచ్చెందుకు యత్నించారని,అది ఆయన గొప్పదనమని అన్నారు. హరివంశ్ ని అభినందించే భారతీయులతో తానూ ఏకీభవిస్తానని ఆయన ట్వీట్ చేశారు.

అటు-కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ సహా వివిధ పార్టీల నేతలు..సస్పెన్షన్ కి గురైన ఎంపీలకు సంఘీభావం ప్రకటిస్తూ సుమారు నాలుగు గంటలసేపు వారితోనే కూర్చున్నారు.